విజయనగరం

ఉద్యోగులకు కలిసి వచ్చిన వరుస సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 11: వరుసగా మూడు రోజులు సెలవులు రావటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కలిసొచ్చింది. ఈ మూడు రోజుల్లో తమకు అనుకూలంగా కృష్ణా పుష్కరాలకు వెళ్లేందుకు చాలామంది ఉద్యోగులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండవ శనివారం, ఆదివారం ప్రభుత్వ సెలవులు కావటం, సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం రావటంతో ఈసారి ఉద్యోగులకు ఆటవిడుపుగా మారింది. కృష్ణా పుష్కరాలలో విధులు నిర్వహించేందుకు జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల నుంచి అధికారులు, సిబ్బంది ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలివెళ్లారు. పుష్కరాలు జరిగే రోజుల్లో అటు విధులతో పాటు కృష్ణా పుష్కర స్నానం చేసేందుకు వీరికి అవకాశం ఏర్పడింది. ఇక పుష్కర విధులు లేక జిల్లాలో ఉండిపోయిన అధికారులు, ఉద్యోగులకు శుక్రవారం నుంచి పుష్కరాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సెలవులు అనుకూలంగా మారాయి. కుటుంబ సభ్యులతో కలసి కృష్ణా పుష్కరాలకు వెళ్లేందుకు చాలామంది ఉద్యోగులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైళ్లలో, బస్సుల్లో వెళ్లేందుకు కొందరు అడ్వాన్స్ టికెట్లు కొనుగోలు చేయగా, మరికొందరు తత్కాల్ టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొంతమంది పుష్కరాలు జరిగే ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలను బుక్ చేసుకుంటున్నారు. పుష్కరాల సందడి కారణంగా శని, ఆదివారాల్లో అద్దె వాహనాలు లభించటం లేదని సమాచారం. శుక్రవారం నుంచి పుష్కరాల సందర్శన కోసం భువనేశ్వర్, విశాఖ ప్రాంతాల నుంచి ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుండటంతో ఈ రైళ్లలో పుష్కర ప్రాంతాలకు వెళ్లి కృష్ణా పుష్కర స్నానాలు ఆచరించేందుకు ఉద్యోగులు సన్నద్ధం అవుతున్నారు. ప్రారంభంలో కాస్త రద్దీ తక్కువగా ఉంటుందనే అభిప్రాయంతో చాలామంది ఈ మూడు రోజుల సెలవులను పుష్కర దర్శనం కోసం సద్వినియోగం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
మూడు రోజులు పనిచేయని బ్యాంకులు : కాగా శనివారం నుంచి మూడురోజులు జిల్లావ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు రావటంతో బ్యాంకు ఉద్యోగులు కూడా పుష్కరాల సందర్శన ప్రయత్నాల్లో ఉన్నారు. రెండవ శనివారం, ఆదివారం బ్యాంకులకు వరుస సెలవులు కావటం, సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం రావటంతో మూడురోజులు బ్యాంకులు పనిచేయని పరిస్థితి ఏర్పడింది. వరుస సెలవులు రావటంతో కొందరు బ్యాంకు అధికారులు, ఉద్యోగులు కృష్ణా పుష్కరాలకు తరలే ఏర్పాట్లలో ఉండగా, మరికొందరు వ్యక్తిగత పనులు పూర్తిచేసుకునే ఆలోచనల్లో ఉన్నారు.