విజయనగరం

పర్యావరణానికి ముప్పు రాకుండా మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, ఆగస్టు 12: ప్రతీఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణానికి ఎటువంటి ముప్పు లేకుండా చూడాలని పురపాలకసంఘం చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి కోరారు. గ్రీన్‌బెల్టు సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఫూల్‌బాగ్ కాలనీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో తప్పనిసరిగా మొక్కలు నాటితే మంచి ప్రయోజనం చేకూరుతుందన్నారు. నానాటికీ పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతీ ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటాల్సిన అవసరం ఉందన్నారు. వేసిన మొక్కలకు తప్పనిసరిగా కంచె ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో బతికేందుకు అవకాశం లేదన్నారు. పురపాలకసంఘం తరపున ఎటువంటి మొక్కలు కావాల్సినా ఉచితంగా అందిస్తామని, వాటిని సంరక్షించే బాధ్యత వేసినవారిపై ఉంటుందన్నారు. పట్టణంలో ప్రతీ సేవా సంస్థ మొక్కలు వేయడంతోపాటు ట్రీగార్డ్స్ ఉచితంగా అందిచేందుకు సహకరించాలని కోరారు. గ్రీన్‌బెల్టు సొసైటీ మొక్కలు నాటేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు రమణమూర్తి, వార్డు కౌన్సిలర్ శ్రీ్ధర్, జగన్నాథంనాయుడు పాల్గొన్నారు.