విజయనగరం

మహనీయుల త్యాగాలతోనే దేశానికి స్వాతంత్య్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా ప్రజలు సోమవారం సంబరంగా నిర్వహించారు. పట్టణాల్లో, పల్లెల్లో వీధివీధిన జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఉదయం నుంచే ప్రభాత్‌భేరీలు, దేశభక్తి గేయాలతో సందడి కనిపించింది. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండలాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆవరణలో గాంధీజీ విగ్రహానికి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ, సర్దార్ వల్లబాయ్‌పటేల్ వంటి మహనీయులు దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. నాటి తరాలవారి ఆశయాలను, ఆలోచనలను నేటితరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. మహనీయుల త్యాగాలను వృథా పోనీయకూడదని, వారిని ఆదర్శంగా తీసుకుని దేశాన్ని, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథాన నడిపించవల్సిన అవసరం ఉందని చెప్పారు. కలెక్టరేట్ భవనంపై జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేస్తూ జిల్లాను ప్రగతిపథంలో నడపాలని జిల్లా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్, డిఆర్వో జితేంద్ర, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కాళిదాసు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో సన్నిహితంగా మెలగాలని, శాంతిభద్రతల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు, సిఐలు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కోర్డులో జిల్లా జడ్జి లక్ష్మినారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అదనపు జిల్లా జడ్జీలు, మెజిస్ట్రేట్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లాపరిషత్ కార్యాలయంపై చైర్‌పర్సన్ స్వాతిరాణి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్చ్భారత్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలుచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. కాగా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైకాపా జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి జెండా ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు జాతీయ జెండా ఎగురవేశారు. బిజెపి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి.జగన్మోహన్‌రావు జాతీయ జెండాను ఎగురవేశారు.