విజయనగరం

మోసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 4: అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఊరూరా ఊదరగొట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగులను నిలువునా మోసగించారని యూత్ కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్జ్ సం కరి సతీష్‌కుమార్ అరోపించారు.రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇచ్చిన ఆదేశాల మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుటయూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్‌కుమార్ మాట్లాడుతూ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, అంతవరకు నిరుద్యోగ భృతికింద నెలకు రెండువేల రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని అన్నారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఏ ఇంట్లో నిరుద్యోగికైనా ఉద్యో గం కల్పించారని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా బాబు అధికారం చేపట్టాక ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. గృహ నిర్మాణశాఖలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఆరోగ్య శ్రీలో నెట్ వర్క్ సిబ్బంది, అంగన్‌వాడీ సహాయకులు 60 ఏళ్లు నిండినవారిని తొలగించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని విమర్శించారు. గడచిన రెండేళ్లల్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడంలో చంద్రబాబు సర్కారు విఫలమైందని ఆరోపించారు. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న చంద్రబాబు రాష్ట్రంలోని లక్షలాదిమంది ఇంజనీరింగ్ నిరుద్యోగులకు మొండిచేయి చూపి సింగపూర్,జపాన్ ఇంజనీర్లపై ఆసక్తి చూపడం దారుణమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎ న్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు యూత్ కాంగ్రెస్ నిరుద్యోగుల కోసమే పోరాడుతుందని చెప్పా రు. ఈ నిరసన దీక్షలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుంగభానుమూర్తి, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు పైడిరాజు, మైనార్టీ విభాగం నాయకుడు షేట్‌కలీల్, బిసిసెల్ అధ్యక్షుడు అప్పారావు, కార్యకర్తలు రామకృష్ణ, సురేష్, శ్రీనివాసరావు, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన పది పరీక్షలు
* 9 నుంచి మూల్యాంకనం
విజయనగరం(టౌన్), ఏప్రిల్ 4: పదో తరగతి పరీక్షలు సోమవారంతో ముగిసాయి. గతనెల 21 నుండి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పరీక్షలు ప్రశాం తంగా ముగిసాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీ య సంఘటనలు చోటుచేసుకోలేదు. కలెక్టర్ ఎంఎం నాయక్ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ యంత్రాంగం పటిష్టమైన చఠ్యలు చేపట్టడంతో తొలిరోజు నుండి చివరి రోజు వరకు పదో తరగతి పరీక్షలు ప్రశాంతం గా జరిగాయి. జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారావు, పరీక్షల తనిఖీ బృందాలు ఎప్పటికపుడు పరీక్షలు జరగుతున్న తీరును పరీశీలించి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. గతనెల 21నుండి ఏప్రిల్ 4 తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలు కాపీకొడుతూ అధికారుల చేతికి చిక్కారు. ఇంతకు మినహా ఎక్కడా ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోలేదు. విద్యార్థులు రాసిన పరీక్షల కాపీలను జాగ్రత్తచేసారు. ఈ నెల తొమ్మిది నుండి పరీక్షల మూల్యాంకన చేయడానికి యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.