విజయనగరం

వైద్య కళాశాల ఏర్పాటు పేదలకు ఉచిత వైద్యం కోసం భాగస్వామ్య స్వచ్చంధ సంస్థ కోసం ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 16: విజయనగరంలో వైద్య కళాశాల ఏర్పాటు, పేదలకు ఉచిత వైద్యం అందించడం ప్రస్తుత పరిస్థితుల్లో మాన్సాస్ ట్రస్ట్‌కు తలకుమించిన భారమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం భాగస్వామిగా చేరే స్వచ్చంధ సంస్థ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. విజయనగరంలో వైద్య కళాశాల ఏర్పాటుచేస్తామని ఎన్నికల సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు హామీ ఇవ్వగా, అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో నడుస్తున్న మాన్సాస్ సంస్థకు ప్రైవేటు వైద్యకళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వైద్య కళాశాల ఏర్పాటుకోసం అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా మాన్సాస్ సంస్థకు చెందిన కొన్ని భూములను వేలం వేసేందుకు కూడా ట్రస్ట్ పాలకవర్గం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ట్రస్ట్‌కు కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మంగళవారం వైద్యకళాశాల ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు సమాధానం ఇస్తూ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరైన సందర్భంగా మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య కళాశాల ఏర్పాటుచేసి పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని తన సోదరుడు దివంగత ఆనందగజపతిరాజు ఆశయమని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాన్సాస్ ట్రస్టు అంత ఆర్థికభారం మోయలేదన్నారు. వైద్య కళాశాల ఏర్పాటు, పేదలకు ఉచిత వైద్యం అందించే విషయంలో మాన్సాస్ ట్రస్టుతో కలిసి పనిచేసే భాగస్వామ్య స్వచ్చంధ సంస్థ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా తమ ట్రస్టుతో కలిసేందుకు ముందుకు వస్తే వైద్య కళాశాల ఏర్పాటు ద్వారా పేదలకు వైద్యం అందిస్తామని అశోక్ తెలిపారు.
కాగా జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన గిరిజన విశ్వవిద్యాలయం తరగతులు ఎప్పుడు ప్రారంభిస్తారో ఇప్పుడే చెప్పలేమని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. మొదట్లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదన వచ్చినప్పుడు పాచిపెంట ప్రాంతాన్ని పరిశీలించారని, అక్కడ ఉన్న మాన్సాస్ ట్రస్టు భూములు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఇచ్చేందుకు తాము సుముఖత వ్యక్తం చేశామని, కానీ కేంద్రబృందం పాచిపెంటలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై సుముఖత వ్యక్తం చేయలేదన్నారు. కొత్తవలస మండలం రెల్లివద్ద ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రబృందం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన తరగతులు ప్రారంభించే విషయమై విలేఖరులు ప్రశ్నించగా తాత్కాలికంగా తరగతులు ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రారంభించవచ్చని, విశ్వవిద్యాలయానికి అవసరమైన వౌళిక వసతులు, కనీస సౌకర్యాలు అందుబాటులో లేకుంటే పాలనాపరంగా ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. గతంలో ఇక్కడ మంజూరైన జూనియర్ కళాశాలను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన సందర్భంలో ఎదురైన ఇబ్బందులను ఆయన గుర్తుచేశారు.