విజయనగరం

ప్రకృతి వ్యవసాయంతో సంపూర్ణ ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేపాడ, ఆగస్టు 20: మన పూర్వీకులను ఆదర్శంగా తీసుకుని ప్రకృతి వ్యవసాయం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. మండలంలోని వీలుపర్తి గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కషాయాల తయారీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. వ్యవసాయశాఖ జెడి ప్రమీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంప్రదాయ ఎరువులకు స్వస్తి పలికి రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం ద్వారా పండించిన ప్రతి పంటలో విషపూరితమైన రోగాలు ఇమిడి ఉన్నాయన్నారు. తద్వారా ప్రస్తుత రోజుల్లో ఏ ఆహారం తీసుకున్నా అందులో ఏదో ఒక రోగం దాగి ఉన్నందున ప్రతి ఒక్కరు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలు కావాల్సి వస్తోందన్నారు. తద్వారా మనిషి ఆయుస్సు తగ్గిపోతుందన్నారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని విడనాడి సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన పంటలను పండించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం పట్ల దృష్టి సారిస్తున్నాయన్నారు. ఆవుల మూత్రం, పేడ ద్వారా సస్యరక్షణ చర్యలు చేపట్టడమేకాకుండా ఎక్కువగా వినియోగించవచ్చని వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పాడి ఆవులను సబ్సిడీపై అందించే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు లీలావతి మాట్లాడుతు రైతులు చైతన్య వంతులై ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగిస్తూ సేంద్రీయ ఎరువుల వాడకాన్ని అంచలంచెలుగా పెంచాలన్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని రైతులు పండించ గలిగితే అనారోగ్య రహిత సమాజాన్ని సాధించగలమన్నారు. డాట్ శాస్తవ్రేత్త శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ఎరువుల తయారి, వినియోగం, పంటల సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. డిపిఎం భాషా మాట్లాడుతు సేంద్రీయ ఎరువుల స్థానంలో ప్రవేశపెట్టిన రసాయనిక ఎరువుల వలన కలిగే దుష్ఫలితాలను ప్రభుత్వం గుర్తించినందునే ప్రకృతి వ్యవసాయంపై ముమ్మరంగా ప్రచారం చేపట్టిందన్నారు. కొత్తవలస ఎడిఎ మహాజన్, మండల వ్యవసాయాధికారిణి ఎ సిరీష, ఎంపిపి దాసరి లక్ష్మి, గుమ్మడి భారతి, తాతారావు, ఎంపిడిఓ వి లక్ష్మి, ఎంపిటిసి దేముడమ్మ, అప్పారావు, ఎపిఎం వెంకటరమణ, ఉపాధి ఎపిఓ చినప్పయ్య పాల్గొని భూసార పరీక్ష కార్డులను రైతులకు పంపిణీ చేశారు.

అంటరానితనాన్ని రూపుమాపాలి
అంటరానితనాన్ని రూపుమాపాలి
గజపతినగరం, ఆగస్టు 20: ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా మెలగాలని బిజెపి ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు. శనివారం మెంటాడ మండలం జక్కువలో ఏర్పాటుచేసిన స్వామివివేకానంద, మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మంలో తొలినాళ్లలో సాంఘిక దురాచారాలు లేవని మధ్యకాలంలో వచ్చిన అంటరానితనం దురాచారాన్ని అందరు కలిసి రూపుమాపాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అందరు కలిసి మెలసి ఉన్నపుడే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు దూసిరామకృష్ణ, స్వామిజీ, ఉత్తరాంధ్ర సాధుపరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాస స్వామిజీ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పివివి గోపాలరాజు, సామాజిక సమసత వేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొల్లి సత్యం, తెరిపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత
* అటవీశాఖ అదనపు చీఫ్ కన్జర్వేటర్ ప్రదీప్ కుమార్
బొండపల్లి, ఆగస్టు 20: ప్రతి ఒక్కరు మొక్కల సంరక్షణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలని అటవీశాఖ విశాఖ సర్కిల్ అదనపు చీఫ్ కన్జర్వేటర్ ఎన్. ప్రదీప్ కుమార్ అన్నారు. శనివారం బొండపల్లి మండల కేంద్రీయ నర్సరీని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు నాటడమేకాకుండా వాటిని సంరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందని దీనిని నివారించడానికి మొక్కలు పెంపకమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. గతంలో 33శాతం అటవీ ప్రాంతం ఉండేదని, ప్రస్తుతం 26శాతం మేర మాత్రమే అడవులు ఉన్నాయని, భావి తరాల భవిష్యత్తు కోసం నేటి నుండే మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. తమ శాఖలో 35శాతం మేర సిబ్బంది కొరతగా ఉన్నా మొక్కల పెంపకంపై పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో సుమారు ఐదు కోట్ల మొక్కలు పెంపకం లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. మహారాష్ట్ర వెదురును మన రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని వర్గాల వారిని మొక్కలు నాటే ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం జరుగుతుందని చెప్పారు. పట్టణ ప్రాంతాలలోని రోడ్డుకి ఇరువైపులా రెండు కిలో మీటర్ల మేర సామాజిక మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో ఉన్న అటవీ శాఖ కార్యాలయాల్లో సైతం విరివిగా మొక్కలు నాటుతున్నామని వివరించారు. బొండపల్లి కేంద్రీయ నర్సరీ పెంపకం పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన మొక్కలు పెంపకం ఆవశ్యకతపై ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు మీడియా పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సామాజిక అటవీ శాఖ డిఎఫ్‌ఓ వేణుగోపాలరావు, టెరిటోరియల్ డిఎఫ్‌ఓ ఎవి రమణమూర్తి, ఫారెస్టు రేంజ్ అధికారులు అప్పలరాజు, రాజారావు, డిప్యూటీ రేంజర్ రవి ప్రసాద్ పాల్గొన్నారు.
స్పష్టతలేని హామీలతో సిఎం కాలయాపన
* లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీశెట్టి విమర్శ

జామి, ఆగస్టు 20: స్పష్టత లేని హామీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాలయాపన చేస్తున్నారని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ అన్నారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాల ఆదుకుంటామని ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇప్పుడు సాధ్యపడదని చెప్పడం దారుణమని తెలిపారు. విభజన సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కపట నాటకాలాడి ప్రజలను మోసగించారన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మిత్ర పక్షంగా ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్రానికి ఎమి కోరనున్నారో ప్రజలకు తెలియచేయాలన్నారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్, ఆడియో కాన్ఫరెన్స్‌లతో కాలయాపన చేయకుంటా ప్రజాహిత కార్యక్రమాలపై దృష్టి సారిస్తే బాగుంటుందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన 11 అంశాలపై హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఏ ఒక్కటీ అమలు చేయలేక పోయార్నారు. జిల్లా గిరిజన యూనివర్సిటీ, ప్రభుత్వ వైద్య కళాశాల వంటి ఎన్నో అంశాలపై దృష్టి సారించకుండా పుష్కరాలు పేరిట రోజుకో కల్లబొల్లి ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారన్నారు. లోక్‌సత్తా పార్టీ మండల అధ్యక్షుడు చిత్తాబత్తుల నాగరాజు పాల్గొన్నారు.