విజయనగరం

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరేసే విధంగా వ్యవహరిస్తున్నాయని ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు బుగత సూరిబాబు కోరారు. పట్టణంలో ఆదివారం జరిగిన విజయనగరం జిల్లా కాల్‌గ్యాస్ ఎంప్లారుూస్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక విధానాలకు వ్యతిరేకిస్తూ జాతీయస్థాయిలో ఎఐటియుసి, ఇతర కార్మిక సంఘాల పిలుపుమేరకు వచ్చేనెల 2వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఎన్‌డిఎ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ప్రస్తుతం ఉన్న చట్టాలను తుంగలోకి తొక్కి బడా పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలుకుతోందన్నారు. వందమందికి తక్కువగా చిన్నపాటి పరిశ్రమలలో కార్మిక సంఘాలు రిజర్వేషన్‌లు చేయించుకునే వీలులేకుండా చేస్తుందని విమర్శించారు. పిఎఫ్, ఇఎస్‌ఐల అమలు విషయంలో కోత విధిస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి తాము అధికారంలోకి వస్తే కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేస్తామని, కొత్త హక్కులు కల్పిస్తామని, కొత్తపరిశ్రమలను స్థాపించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీలను గుప్పించాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు ప్రభుత్వాలు ఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు. గడిచిన రెండేళ్లలో విదేశీ పర్యటనలకే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని తెలిపారు. ఇప్పటికైనా ఉద్యోగులు, కార్మికులు హక్కుల కోసం పోరాడవల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎఐటియుసి, ఇతర కార్మిక సంఘాల పిలుపుమేరకు వచ్చేనెల 2వ తేదీన తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాల్‌గ్యాస్ ఎంప్లారుూస్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.మనోహర్, మహంతి కృష్ణారావు, ఎస్.ఆనందరావు, ఎం.నారాయణరావు, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.