విజయనగరం

నీటితడి అందక ఎండిపోతున్న పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 21: నార్లు మాడిపోతున్నాయి... తడి అందక వేసిన పంటలు ఎండిపోతున్నాయి.. కానీ జోరువర్షాలు ఎప్పుడు కురుస్తాయోనని జిల్లా రైతులు దిగాలు పడుతున్నారు. గత ఏడాది వర్షాభావంతో ఆర్థికంగా నష్టపోయిన జిల్లా రైతాంగం ఈ ఏడాది సంతృప్తికరమైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన ప్రకటనలతో ఊరట చెందినా, ప్రస్తుత పరిస్థితులు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. మగశిరకార్తె ప్రారంభం నుంచి రైతులు ఖరీఫ్ ఏర్పాట్లు ప్రారంభించినా ఇప్పటివరకు తేలికపాటి వర్షాలే తప్ప వరుసగా నాలుగు రోజులపాటు వర్షాలు కురియకపోవటంతో వ్యవసాయం పనులు ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కిలా మారాయి. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి కురిసిన వర్షాన్ని పరిగణనలోకి తీసుకుంటే జూన్, జూలై నెలలో వర్షం సాధారణానికి మించి కురిసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నా కురిసిన వర్షాలు సమతూకంలో లేకపోవటం రైతులకు ఇబ్బందిగా మారింది. వర్షానికి, వర్షానికి మధ్య ఎక్కువ రోజుల గడవు ఉండటం, కురిసిన వర్షం కొన్ని మండలాలకే పరిమితం కావటం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
సాగునీటి ప్రాజెక్టుల కింద సేద్యం కాస్త బాగానే ఉన్నా జిల్లాలో ఎక్కువ శాతం వర్షాధార పంటలు కావటంతో వర్షాల కోసం రైతులు కళ్లలో వత్తలు వేసుకుని ఎదురు చూడవల్సిన పరిస్థితి అడపాతడపా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో ఇప్పటివరకు 66వేల హెక్టార్లలో వరిపంట వేశారు. ఇది సాధారణ విస్తీర్ణంలో 55శాతం మాత్రమే. వర్షాలు బాగా పడితే ఇప్పటికే నాట్లు పూర్తయి కలుపులు తీసే పనులు మొదలయ్యేవి. కానీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో నాట్లు పడక నార్లు ముదిరి పోవటంతోపాటు ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల వేసిన వరిపంట, మరికొన్ని నారుమళ్లను ఎండిపోకుండా రైతులు డ్రమ్ములతో నీటిని తీసుకువచ్చి తడపటం ద్వారా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వేరుశనగ పంట 9625హెక్టార్లకుగాను 2500హెక్టార్లలో వేయగలిగారు. గోగుపంట 8910హెక్టార్లకుగాను 3701 హెక్టార్లలో మాత్రమే వేశారు. మొక్కజొన్న, చెరుకు పంటల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా వర్షాలు లేని కారణంగా మిగతా పంటల వేయలేక రైతులు చేతులు ఎత్తివేయవల్సిన పరిస్థితి ఏర్పడింది. చెరువులు, కుంటల కింది భూముల్లో రైతులు వివిధ పంటలు వేసినా చివరి వరకు నీరు అందుతుందో, లేదోననే బెంగ రైతుల్లో మొదలైంది. ఈ నెలాఖరులోగా భారీవర్షాలు కురియకుంటే తమ పరిస్థితి దయనీయంగా మారుతుందని రైతులు వాపోతున్నారు.
దత్తిరాజేరులో..
దత్తిరాజేరు: మండలంలోని గత నెలరోజులుగా సరైన వర్షాలు కురవకపోవడంతో వేసిన వరినార్లు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి సమృద్ధిగా వర్షాలు కురియడంతో చెరువులలో నీరు పుష్కలంగా ఉండడంతో ఉభాలు జరిపి వరినాట్లు వేశారు. ఈ ఏడాది ప్రస్తుతానికి మండలంలోని 35 గ్రామ పంచాయతీలలో ఏ సాగునీటి చెరువులలో కూడా చుక్కనీరు లేకపోవడంతో రైతన్నలు దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు. వరినారు వేసి నెలరోజులకు పైగా కావడంతో వరినారు ముదిరిపోయే పరిస్థితి ఉండడంతో వ్యవసాయ బోర్లు ఉన్న దగ్గర ఉభాలు చేసి వరినాట్లు వేశారు. ఇంతవరకు వర్షాలు కురవక పోవడంతో వేసిన వరినాట్లు కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొంది. పలు గ్రామాల్లో వరినారు ముదిరిపోయే పరిస్థితితోపాటు ఎండిపోవడంతో బావులలో నీరు తోడి వరినారు తడపవల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి మరో వారం రోజులు కొనసాగిన పక్షంలో వరినారు ముదిరిపోయి నాట్లు వేయలేని పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.