విజయనగరం

విద్యా సంస్కరణ వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 23: తెలుగుదేశం ప్రభుత్వం బిసి,ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేవిధంగా విద్యా సంస్కరణలు చేస్తుందని మైదాన గిరిజన ప్రాంత విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ రఘుపతుల శశిభూషణ్ అన్నారు. పట్టణంలో కోట జంక్షన్ వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యలో సంస్కరణలను అమలు చేయడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి డిగ్రీ తర్వాత పిజి, బిఇడి ఏదొక కోర్సుకు మాత్రమే స్కాలర్‌షిప్,్ఫజు రీ-యింబర్స్‌మెంట్ విధానం వర్తించేవిధంగా ఇ-పాస్ వెబ్‌సైట్‌లో మార్పు చేసిందన్నారు. దీనిపై అడ్మిషన్ల కౌనె్సలింగ్ సమయంలో విద్యార్థులకు కనీస సమాచారం ఎపి ఉన్నత విద్యాశాఖ ఇవ్వలేదని తెలిపారు. ఈ కారణంగా చాలామంది పేద విద్యార్థులు అవగాహన లేక పిజి, బిఇడి కోర్సులలో చేరారని చెప్పారు. ప్రస్తుతం స్కాలర్‌షిష్, ఫీజు రీ-యింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తులు చేసుకుంటే ఎపి ఇ-పాస్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదయ్యే అవకాశం లేకుండా పోయిందన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు అధిక ఫీజులు చెల్లించి ఉన్నత విద్యను అభ్యసించలేక తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు.