విజయనగరం

గ్రామీణ ప్రాంతాలకు రహదారుల కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 5: జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చంద్రన్న బాట కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 450కిలోమీటర్ల సిమెంటు రోడ్ల నిర్మాణం చేపడతారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని తెలిపారు. ఈ వేసవిలో నీటిఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.482కోట్లు ఖర్చుచేసి 321కిలోమీటర్ల అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టారన్నారు. 61రోజుల్లో భారీమొత్తంలో రోడ్ల నిర్మాణం చేపట్టడం జిల్లా రికార్డని తెలిపారు. గడచిన ఐదేళ్లలో గ్రామీణాభివృద్ధి, పేదల ఉపాధి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలలో కేంద్ర మెటీరియల్ కాంపోనెంట్ కింద ఇచ్చే నిధులను సక్రమంగా వినియోగింవచుకోవటం లేదని చెప్పారు. ఈ విధంగా సుమారు 5400కోట్ల రూపాయలు వెనక్కి వెళ్లిపోయాయని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రప్రభుత్వం వాడవాడలా చంద్రన్నబాట, నీరుచెట్టు తదితర పథకాల కింద మెటీరియల్ కాంపోనెంట్ నిధులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించిందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చంద్రన్నబాట కార్యక్రమం కింద రాష్టవ్య్రాప్తంగా 3880కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిందని అన్నారు. అంతర్గత సిమెంటు రోడ్ల నిర్మాణాలలో నాణ్యత లోపించకుండా, నిబంధనలు అతిక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. మంచినీటి ఎద్దడి నివారణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త బోర్ల ఏర్పాటుకు చాలా విజ్ఞప్తులు వస్తున్నాయని, కానీ భూగర్భజలాల మట్టం తగ్గిపోయిన కారణంగా కొత్త బోర్లు వేసినా ప్రయోజనం ఉండదని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నీరు-చెట్టు కార్యక్రమం అమలు ద్వారా భూగర్భజలాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చెరువులు పూడికలు తీయటం, నీటికుంటలు భారీసంఖ్యలో ఏర్పాటుచేయటం, చెక్‌డ్యాంల నిర్మాణం, మరమ్మతులు చేపట్టడం ద్వారా నీటిమట్ట పెంచేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. వర్షాకాలం ఆరంభం నాటికి పెద్దమొత్తంలో మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించామని అన్నారు. విలేఖరుల సమావేశంలో ఢ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.