రాష్ట్రీయం

పదోన్నతులపై వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్వర్ట్, డైరెక్ట్ ఎస్‌ఐల మధ్య విభేదాలు
ప్రమోషన్లకు అడ్డుపడుతున్న సర్వీసు రూల్స్
పోలీస్ బాస్‌లకు దిగులు పుట్టిస్తున్న వైనం
హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలోని ఖాళీలతోపాటు కొత్త నియామకాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో శాఖ పరిధిలోని కన్వర్ట్, డైరెక్ట్ ఏఎస్‌ఐ, ఎస్‌ఐల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, రాజకీయ నేతల ప్రమేయం వల్ల అనవసర మార్పుల వల్ల బాధ్యతతో విధులు నిర్వహించాల్సిన పోలీసులు బాధ్యతలను పక్కనబెట్టి సర్వీసు మ్యాటర్‌పై కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైనం పోలీసుల ఉన్నతాధికారుల్లో దిగులు పుట్టిస్తోంది. పోలీసు శాఖలో సర్వీసు రూళ్ల మార్పుల కారణంగా ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, సిఐ పదోన్నతుల్లో తీవ్రంగా నష్టపోతున్నట్టు కొందరు నొచ్చుకుంటున్నారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా పోలీసుల్లో సివిల్, రిజర్వు, స్పెషల్ పోలీసు అని మూడు విభాగాలుగా విభజించి నియామకాలు జరుగుతాయి. అందరికీ ఒకటే జివో, నోటిఫికేషన్ వచ్చినప్పటికీ వారికి నిర్వహించే పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. కాగా మెరిట్, మార్కుల ఆధారంగా వారిని సివిల్, రిజర్వు, స్పెషల్ పోలీసు విభాగాలకు కేటాయిస్తారు. ఈ మూడు విభాగాలకు వేర్వేరు శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం సివిల్ విభాగం వారికి లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ వంటి విభాగాల్లో నియమిస్తారు. రిజర్వు పోలీసులు అయితే ఎస్కార్ట్, గన్‌మెన్, బందోబస్తు, రక్షణవంటి విధులు నిర్వహిస్తూ జిల్లా కేంద్రాల్లో ఉంటారు. స్పెషల్ పోలీసులు బెటాలియన్‌లో ఉంటూ స్టేషన్ల రక్షణ, ఎన్నికల బందోబస్తు, విపత్తులో సహాయక చర్యలు వంటి విధులు నిర్వహిస్తారు. కాగా స్పెషల్ పోలీసులో నియమింపబడిన వారు సివిల్, రిజర్వు విభాగాలపై మక్కువతో మళ్లీ సెలక్షన్స్‌కు వెళ్తుంటారు. అదేవిధంగా రిజర్వు పోలీసులో నియమితులైన వారు సివిల్ విభాగంపై మక్కువతో మళ్లీ సెలక్షన్‌కు వెళ్తుంటారు. సివిల్ విభాగానికి సెలెక్ట్ కాలేక దానిపై మక్కువ వదులుకోని కొందరు ఆర్‌ఎస్‌ఐలు ప్రభుత్వ పెద్దల సెక్యూరిటీలో పనిచేసిన అనుభవంతో ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో ప్రభుత్వ ఉత్తర్వుల రూపంలో సివిల్ ఎస్‌ఐలుగా కన్వర్ట్ అవుతుండటంతో వివాదం తలెత్తుతోంది. కొంతమంది ఆర్‌ఎస్‌ఐలతో మొదలైన ప్రక్రియ పూర్తిస్థాయిలో వేళ్లూనుకుంటుంది. ఇప్పుడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పదోన్నతులకు డైరెక్టుగా నియమింపబడిన సివిల్ ఎస్‌ఐలకు రిజర్వు, స్పెషల్ పోలీసు విభాగాల నుంచి కన్వర్షన్ ప్రక్రియ ద్వారా సివిల్ ఎస్‌ఐలుగా మారిన వారు పోటీకి రావడంతో డైరెక్టు, మరియు కనె్వర్షన్ ఎస్‌ఐల మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. ఎన్లో ఏళ్లుగా రక్షణ, విపత్తు నిర్వహణ, మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణలో పనిచేసిన తాము సివిల్ విభాగానికి కన్వర్ట్ అయ్యే అవకాశం కల్పించడం న్యాయమంటూ కన్వర్ట్ ఎస్‌ఐలు అంటుంటే, డైరెక్ట్‌గా సెలెక్ట్‌కాలేక ప్రభుత్వం నుంచి జీవోల రూపంలో సివిల్‌కు వచ్చిన కన్వర్షన్ ఎస్‌ఐలు తమకు పోస్టింగులతో సహా అన్ని విధాలుగా అడ్డుపడుతున్నారని డైరెక్ట్ ఎస్‌ఐలు ఆరోపిస్తున్నారు. జీవోఎంఎస్ నెం.2437, తేదీ 08.11.1996 ప్రకారం డైరెక్ట్, కన్వర్షన్ ఎస్‌ఐల పదోన్నతులకు ఆరేళ్ల సర్వీసు, కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన వారు పదోన్నతులకు నాలుగేళ్ల సర్వీసు ఉండాలని నిబంధన. నాటినుంచి సజావుగా సాగిన పదోన్నతులు 2013లో అప్పటి ప్రభుత్వం జీవో నెం 208 తీసుకువచ్చి నిబంధనలను తలకిందులు చేసింది. పరస్పర జీవోల ద్వారా కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్టర్ దాకా పదోన్నతులు పొందే అవకాశం కోల్పోవాల్సి వస్తుందని, డైరెక్టుగా వచ్చే ఎస్‌ఐలే లబ్దిపొందుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కన్వర్షన్ ఎస్‌ఐలు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించగా ఉమ్మడి హైకోర్టు రిట్ పిటిషన్ నెం. 21172/2014 తీర్పు చెబుతూ ట్రిబ్యునల్ తీర్పులో సహేతుకమైన కారణాలు లేవని తీర్పును కొట్టివేసింది. మరికొద్ది రోజుల్లో ఇన్‌స్పెక్టర్ పదోన్నతులు పొందాల్సిన డైరెక్ట్ ఎస్‌ఐలు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించగా స్పెషల్ లీవ్ పిటిషన్ 6633/2015 విచారణలో ఉంది. ప్రభుత్వం ట్రిబ్యునల్ తీర్పు అనంతరం జీవో 208ని రద్దు చేస్తూ జీవో 156 తేదీ 15 నవంబర్ 2014ని విడుదల చేసింది. హైకోర్టు తీర్పు అనంతరం జీవో 156ని రద్దు చేస్తూ జీవో 38ను విడుదల చేసింది. ఈ అంశాలను అనుకూలంగా మలచుకున్న ప్రభుత్వం ఖాళీలు ఉన్నప్పటికీ పదోన్నతులు ఇవ్వకుండా తాత్సారం చేస్తుందన్న విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. ఎస్‌ఐల గొడవ ఇలావుంటే కానిస్టేబుళ్ల పరిస్థితి మరీ విచిత్రం. సివిల్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాలంటే కనీసం ఐదారేళ్లు సర్వీసు ఉండాలి. స్పెషల్ పోలీసు విభాగంలో భర్తీ అయిన కానిస్టేబుల్ రిజర్వు విభాగానికి కన్వర్ట్ అయితే పాత సర్వీసు వర్తించదు. కానీ రిజర్వు విభాగంలో భర్తీ అయిన కానిస్టేబుల్ సివిల్ విభాగానికి కన్వర్ట్ అయితే మాత్రం పాత సర్వీసు వర్తిస్తుంది. ఇలా పరస్పర జీవోలు పోలీసుల్లో బాధ్యత లేకుండా విధులు నిర్వహిస్తూ పదోన్నతుల్లో కోర్టులను ఆశ్రయించే దుస్థితి నెలకొనడంతో పోలీసు ఉన్నతాధికారులో గుబులు పుట్టిస్తుంది. పోలీసులు పరస్పర అవగాహనతో కలసిమెలసి పనిచేయాల్సిన వాళ్ల మధ్య సర్వీసు రూల్స్ చిచ్చుపెట్టిందని పలువురు పోలీసులు అధికారులు వాపోతున్నారు.