రాష్ట్రీయం

పోలింగ్ 69 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముగిసిన వరంగల్ ఉప ఎన్నిక
స్వల్ప ఘటనలు వినా ప్రశాంతం
ఫలించిన పోలీస్ భద్రతా వ్యూహం
ఫలితాలపై ప్రధాన పక్షాల లెక్కలు
ఓటర్లకు సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు
24న ఓట్ల లెక్కింపు

హైదరాబాద్, నవంబర్ 21: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో 69 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, 69.1 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ పోలింగ్ ముగిసిన తరువాత శనివారం రాత్రి మీడియాకు ప్రకటించారు. సాధారణ ఎన్నికలకన్నా పోలింగ్ తగ్గవచ్చన్న రాజకీయపక్షాల అంచనాలకు భిన్నంగా పోలింగ్ శాతం నమోదైంది. భారీ పోలింగ్ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు ఫలితాలపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీ స్టేషన్ ఘన్‌పూర్‌లో 75.55 శాతం, పరకాలలో 76.69 శాతం, పాలకుర్తిలో 76.51, వర్థన్నపేటలో 74.3, భూపాలపల్లిలో 70.1, వరంగల్ తూర్పులో 62.21, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 48.3 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఇదిలావుంటే, ఎన్నికల సరళిని చూసి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్న ధీమాతో అధికారపక్షం కనిపిస్తోంది. ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ జరగడంతో ప్రధాన రాజకీయ పక్షాలు ఫలితాలపై లెక్కలు మొదలుపెట్టాయి. పోలింగ్ పది శాతం తగ్గడంవల్ల మెజారిటీ సైతం అదేస్థాయిలో తగ్గుతుందని కొందరంటుంటే, భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని అధికారపక్షం నేతలు అంటున్నారు. సిఎం కెసిఆర్ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లో ఉత్సాహంగా ఓట్లేసిన ఓటర్లకు సిఎం కె చంద్రశేఖర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ, గ్రామీణ ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమయ్యారని, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని ప్రకటనలో ప్రశంసించారు. ఇదిలావుంటే, ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. ధర్మసాగర్ మండలం జానకీపురం, పరకాల, వెంటేశ్వరపల్లి, భూపాలప్లి, సంగెం మండలం ఎల్లూరు, రంగంపేటలో ఈవిఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. భూపాలపల్లిలో తెరాస, కాంగ్రెస్ మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఓటు హక్కు వినియోగించుకునేది లేదంటూ కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో జిల్లా కలెక్టర్ జ్యోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పోటీలోవున్న తెరాస, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థుల్లో ఒక్క తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ మాత్రమే బొల్లికుంట గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూధనాచారి, ఎస్పీ అంబర్ కిషోర్ ఝూ, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, ఎమ్మెల్యేలు ఒటు హక్కు వినియోగించుకున్నారు.
ఇదిలావుంటే, ఎన్నికల ముందు వరకు గెలుపు మాదేనని కాంగ్రెస్, బిజెపి ప్రకటించినా, పోలింగ్ సరళి తరువాత వైఖరి మార్చుకున్నాయి. మెజారిటీని తగ్గించగలిగామని ఇతర పార్టీల నేతలు అంటున్నారు. పది శాతం పోలింగ్ తగ్గడం, ఊహించని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ రంగంలోదిగి, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ ప్రభావం ప్రధాన పార్టీలపై ఉండే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం పోలింగ్ నమోదు కావడంపైనే తెరాస ఆశలు పెట్టుకుంది. వరంగల్ నగరంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఈ రెండింటిలోనే పోలింగ్ శాతం తక్కువగా ఉంది. మిగిలిన నియోజక వర్గాల్లో మాత్రం సాధారణ ఎన్నికల సమయంలో ఉన్నట్టుగానే పోలింగ్ శాతం నమోదైంది. తెదేపా ఎమ్మెల్యే దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తిలో అత్యధికంగా 77 శాతం పోలింగ్ జరిగింది. దీంతో బిజెపి నేతలు ఈ నియోజకవర్గంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఆసరా పథకం కింద నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ చెల్లించడం ఈ ఎన్నికల్లో అధికార పక్షానికి బాగా కలిసొచ్చిన అంశమని పార్టీ నేతలు అంటున్నారు. మెజారిటీపై ఒకపక్క ఉత్కంఠ కనిపిస్తుంటే, రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటుందా? బిజెపి పరిస్థితిలో మార్పు కనిపిస్తుందా? అన్న అంశంపైనా నేతల్లో ఆసక్తి కనిపిస్తోంది. **వంగపహాడ్‌లో బారులు తీరిన మహిళా ఓటర్లు **