తెలంగాణ

వరంగల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ : సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ : వరంగల్ అభివృద్ధి కోసం స్పెషల్ అథారిటీ డెవలప్‌మెంట్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందులాల్, జిల్లా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ వరంగల్‌కు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయిస్తామన్నారు. దేశంలోనే అతిపెద్ద మల్టీపుల్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. రామప్ప చెరువు నుంచి లక్నవరం, ఘణపురంచెరువులకు నీరందిస్తామని పేర్కొన్నారు.