క్రీడాభూమి

ఇంగ్లాండ్ చేతిలో కివీస్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 12: టి-20 వరల్డ్ కప్ పోటీలకు సిద్ధమయ్యేందుకు వీలుగా శనివారం జరిగిన వామప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఇంగ్లాండ్ ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. కేన్ విలియమ్‌సన్ 63 పరుగులతో రాణించగా, మాజీ కెప్టెన్ రాస్ టేలర్ అజేయంగా 19 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ 15 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. రీస్ టోప్లే 39 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. అనంతరం ఇంగ్లాండ్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే, నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జాసన్ రాయ్ 55, అలెక్స్ హాలెస్ 44 పరుగులు చేసి, ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. న్యూజిలాండ్ బౌలర్లు మిచెల్ సాంటన్ 24 పరుగులకు రెండు, నాథన్ మెక్‌కలమ్ 25 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. ఇలావుంటే సూపర్-10లో ఇంగ్లాండ్ తన మొదటి మ్యాచ్‌ని వెస్టిండీస్‌తో ఆడుతుంది. ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహిస్తున్న ఈ జట్టులోని పలువురు ఆట గాళ్లు నిలకడగా ఆడుతూ, విజయాలపై ఆశలు కల్పిస్తున్నారు.