యువ

కాదేదీ వృథా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

===========
ముందడుగంటూ వేయకపోతే..అసలు పయనమే మొదలు కాదు. ఆ అడుగు ఎటు పడుతుందన్నదే విజయబాటను నిర్దేశిస్తుంది. ఇద్దరు కుర్రాళ్లు ‘వ్యర్థాల’మార్గాన్ని ఎంచుకున్నారు. తొలి అడుగులు తడబడ్డా..వృధా నుంచే ఉపాధిని పెంచారు. ఒకప్పుడు ఉద్యోగులైన ఈ ఇద్దరూ ఇప్పుడు పదిమందికి పని కల్పించారు..
===========

రిస్క్...నష్ట భయం..ఇది లేకుండా ఎదుగుదలే ఉండదు
ఆ విషయాన్ని త్వరగానే గ్రహించారు ఇద్దరు కుర్రాళ్లు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు స్వస్తి చెప్పి, అనుకున్న ప్రాజెక్టు చేపట్టారు. మొదట్లో కష్టాలు పలకరించినా, నిలదొక్కుకుని, సక్సెస్ బాట పట్టారు. బన్యన్ నేషన్ పేరిట స్టార్టప్ కంపెనీ పెట్టి, ఐదు కోట్ల రూపాయల ఫండింగ్ సంపాదించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
స్ఫూర్తిదాయకమైన వారి ప్రస్థానం
‘యువ’ పాఠకులకు ప్రత్యేకం.
********
మణి వాజపేయి, రాజ్ మదనగోపాల్ ఇద్దరూ ఫ్రెండ్స్. యూనివర్శిటీ ఆఫ్ డెలావర్‌లో కలసి చదువుకున్నారు. మణి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పిహెచ్‌డికోసం చేరితే, రాజ్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎమ్మెస్ చేశాడు. కలసి చదువుకోవడమే కాదు, కలసి క్లాస్‌కు బంక్ కొట్టి, సినిమాలకు చెక్కేయడంలోనూ వారే ఫస్ట్. చదువు పూర్తయ్యాక ఇద్దరి దారులూ వేరయ్యాయి.
కట్ చేస్తే... ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న మణికి ఎప్పుడూ ఒకటే ఆలోచన. ఓ మూల కూర్చుని ఉద్యోగం చేసుకోవటం కంటే పదిమందికీ ఉద్యోగాలిచ్చే పొజిషన్‌కి ఎదగాలన్నది అతని కల. ఈ నేపథ్యంలో ఓ రోజు వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రిసైక్లింగ్ గురించి విన్నాడు. స్టడీ చేస్తే తెలిసిందేమంటే...ఇండియాలో ఏటా 67 లక్షల టన్నుల పునర్వినియోగం (రీసైకిల్) చేయదగిన వ్యర్థాలను వృథాగా పారబోస్తున్నారు. ఈ వ్యర్థాల విలు వ 19వేల కోట్ల రూపాయల పైమాటే. ఇది తెలిశాక మణి కి నిద్ర పట్టలేదు. ఉద్యో గం వదిలి స్టార్టప్ పెట్టే పనిలో పడ్డాడు.
అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న రాజ్‌కు మణి తన ఆలోచన చెప్పాడు. అమెరికాలోనే స్థిరపడి మొబైల్ స్టార్టప్ పెట్టాలనే ఆలోచనలో ఉన్న రాజ్‌కు మణి ఆలోచన నచ్చింది. తన ఉద్యోగాన్నీ వదిలేసి, ఇండియాకు వచ్చేశాడు. మణి సిఇఓగా, రాజ్ సిఓఓగా బన్యన్ ట్రీ ఆవిర్భవించింది.
ఇండియాలో వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిలో చాలావరకూ శాస్ర్తియత లోపించినవే ఎక్కువ. హైదరాబాద్‌లోనూ ఇలాంటి కంపెనీలు ఎన్నో ఉన్నా, వాటిలో రిజిష్టర్ చేసుకున్నవి చాలా తక్కువ. ఈ కంపెనీలు చేసే ఉత్పత్తులన్నీ నాణ్యత లోపించినవేనన్న విషయాన్ని మణి, రాజ్ ద్వయం గమనించింది. కొందరు ఉద్యోగులను పనిలోకి తీసుకుని, వారికి కనీస వేతనాలు ఇవ్వడం మొదలుపెట్టారు. పరిశ్రమలనుంచి వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ ప్రారంభించారు.
స్టార్టప్ అయితే పెట్టారు గానీ, ఎక్కడినుంచి, ఎలా మొదలుపెట్టాలో వారికి తెలియలేదు. పైగా ఒక విధివిధానమంటూ లేని వ్యాపారాన్ని ఎంచుకోవడం, అధికాదాయ మార్గాలు కనిపించకపోవడంతో వారికి మొదట్లోనే ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో పెట్టుబడులకోసం మణి సింగపూర్, అమెరికాలకు వెళ్లి ప్రయత్నించాడు. అప్పటికి వారి బ్యాంక్ అకౌంట్లో ఉన్నది కేవలం ఐదువేల డాలర్లు! అయితే వీరి శ్రమను, పట్టుదలను గుర్తించిన ‘ఆర్థా కేపిటల్’ 5.36 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీంతో బన్యన్ నేషన్ దశ తిరిగింది. ఇప్పుడు బన్యన్ నేషన్ చేతిలో అనేక కాంట్రాక్ట్‌లు ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్యా పెరిగింది. వ్యర్థాల సేకరణ మొదలు రీసైకిల్డ్ మెటీరియల్‌ను సరఫరా చేసే వరకూ బన్యన్ నేషన్ సిస్టమేటిక్‌గా పనిచేయడంతో వినియోగదారుల సంఖ్యా పెరుగుతోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కూ తమ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తామంటున్నారు మణి, రాజ్.
*
** మణి వాజపేయి , రాజ్ మదనగోపాల్ **