యువ

వా‘చీ’లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్నాలజీ...!

ఒక చేత్తో అద్భుతాలను సృష్టిస్తుంది
మరో చేత్తో అనర్థాలకు తెరతీస్తుంది
మానవ వికాసానికి ఆల్‌ఫ్రెడ్ నోబెల్ కనిపెట్టిన డైనమైట్...మానవ విధ్వంసానికీ ఉపయోగపడుతున్నట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమూ అనర్థాలకు కారణమవుతోంది. అసలు విషయానికొస్తే...ఇప్పుడు టైటాన్, టైమెక్స్ వంటి వాచీలను యువత వాడటం మానేసింది. ఎవరి చేతిని చూసినా స్మార్ట్‌వాచీలే. ఈ స్మార్ట్‌వాచీల్లో కొన్ని రకాలు పరీక్షల్లో కాపీలు కొట్టడానికి కారణమవుతున్నాయి. కొన్ని వాచీల కంపెనీలు ఏకంగా ‘పరీక్షల్లో కాపీ కొట్టడానికి తయారు చేసిన వాచీలు’, తేలిగ్గా చదువుకునేందుకు తయారైన వాచీలు’ అంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఈ రకమైన వాచీల్లో డేటాను స్టోర్ చేసుకోవచ్చు. దానిని పరీక్షల్లో కాపీ కొట్టొచ్చన్నమాట. పైగా ఈ వాచీలను అనుసంధానం చేస్తూ ఓ వైర్‌లెస్ ఇయర్‌పీస్ కూడా ఉంటుంది. కాబట్టి పరీక్షల్లో కాపీ కొట్టే వారికి ఇక అడ్డూ ఆపూ ఉండదు. అంతకుమించి ఈ డిజిటల్ వాచీలకు ఓ ఎమర్జెన్సీ బటన్‌కూడా ఉంటుంది. ఇదెందుకంటే... ఇన్విజలేటర్‌కు అనుమానం వచ్చినా వెంటనే టెక్స్ట్ మోడ్‌నుంచి క్లాక్‌లోకి మారిపోయేందుకన్నమాట.
మరికొన్ని రకాల వాచీల్లో 4జిబి స్టోరేజ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అంటే ఎక్కువ డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాదు...టెక్స్‌ట్‌ను చదవాలంటే ప్రత్యేకంగా రూపొందించిన గ్లాసెస్‌ను ధరించాలి. ఈ ‘వెసులుబాటు’ ఎందుకంటే, ఒకవేళ ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి వాచీని చూసినా, అతనికి స్క్రీన్‌పై టెక్స్‌ట్ కనపడదు. ఇలాంటి వాచీల ధర 61 డాలర్లనుంచి 75 డాలర్ల వరకూ ఉంటోంది. పైపెచ్చు ఇలాంటి వాచీలు కొన్ని ప్రముఖ ఇ కామర్స్ సంస్థలూ అమ్ముతుండటమే విచారకరం. కొత్తపుంతలు తొక్కుతున్న టెక్నాలజీ పరీక్షల నిర్వహణకు మరిన్ని సవాళ్లు విసురుతోంది. *