తెలంగాణ

జోరుగా వాటర్ గ్రిడ్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 12: నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ (వాటర్ గ్రిడ్) తొలి దశ పనులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. 800 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో తొలి విడతగా ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు ఇంటింటికీ తాగునీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 1600 కిలోమీటర్ల పైప్‌లైన్లు, 29 ఓవర్‌హెడ్, జిఎల్‌ఆర్ మంచినీటి ట్యాంకుల నిర్మాణాల పనులు చేపట్టగా ఇప్పటికే 200 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్లు వేశారు. మంచినీటి ట్యాంకుల నిర్మాణాలు సైతం పురోగతిలో ఉన్నాయి. 11 మండలాల్లో గ్రిడ్ పనుల కోసం ఆర్‌డబ్ల్యుఎస్, వాటర్ గ్రిడ్ ప్రత్యేక విభాగం ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. కరవు, ఫ్లోరైడ్ పీడిత ఆలేరు, భువనగిరి మండలాలకు మిషన్ భగీరథ కింద ఇంటింటికీ మంచినీటి అందించే పనులు అక్కడి గ్రామాల్లో సాగుతున్నాయి. అయితే ఇంజనీర్ల కొరత గ్రిడ్ పనుల పరుగులకు బ్రేక్‌లు వేస్తుండడం సమస్యాత్మకంగా తయారైంది.
ఇంజనీర్ల కొరత!
మిషన్ భగీరథ పనులు జరుగుతున్న ఆలేరు, భువనగిరి నియోజవర్గాల గ్రిడ్ డివిజన్‌కు జేఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్ల కొరత ఆటంకంగా తయారైంది. ఇక్కడ తక్షణమే కనీసంగా ఒక నలుగురేసి చొప్పున జెఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు కావాల్సిన అవసరముంది. లేనట్లయితే గ్రిడ్ పనుల్లో వేగం..నాణ్యతల పర్యవేక్షణ కొరవడే పరిస్థితులు నెలకొన్నాయి. అటు ఆర్‌డబ్ల్యుఎస్‌లో సైతం జిల్లాలో ఒక ఎస్‌ఈ, 12 సబ్‌డివిజన్లు ఉండగా 59 మండలాలకుగాను ఒక్కో మండలానికి జేఈ, నియోజకవర్గానికి డిఈఈలు పనిచేయాల్సివుంది. అయితే 13 డిఈఈ పోస్టులకు 6 పోస్టులు, 62 జేఈ పోస్టులకు 28 ఖాళీలు ఉన్నాయి. జిల్లాలో 3,409 హ్యాబిటేషన్లలో 4,826 మంచినీటి పథకాలు, 19 వేల చేతి పంప్‌లు, 244 సిపిడబ్ల్యుఎస్ స్కీమ్‌లతో కృష్ణా మంచినీటి సరఫరా జరుగుతుంది. 19 చోట్ల మంచినీటి పథకాల పనులు పురోగతిలో ఉన్నాయి. వీటికి తోడు వేసవిలో బోర్లు ఎండిపోతుండడం, మరమ్మతులకు గురికావడం, మంచినీటి పథకాల మోటార్లు మొరాయించడం వంటి సమస్యలు అధికమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జేఈలలో కొందరికి మూడు మండలాల బాధ్యతలు అప్పగించడం, పంచాయతీరాజ్‌శాఖ నుండి డిప్యూటేషన్ తీసుకోవడం వంటి వాటితో మంచినీటి పథకాల పర్యవేక్షణ బాధ్యతలు లాగించేస్తున్నారు. కొన్ని సబ్ డివిజన్లలో వాటర్‌గ్రిడ్ పనుల బాధ్యతలు కూడా ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్లే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటర్ గ్రిడ్‌కు, ఆర్‌డబ్ల్యుఎస్ విభాగానికి పనులకు సరిపడ ఇంజనీర్లు అందుబాటులో లేకపోవడంతో అటు గ్రిడ్ పనులు, ఇటు వేసవిలో మంచినీటి సరఫరాను సమర్ధవంతంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఆయా విభాగాల్లో ఇంజనీర్ల భర్తీకి చర్యలు చేపడితేనే గ్రిడ్ పనులు సకాలంలో పూర్తి చేయడంతో పాటు తాగునీటి సమస్యలను నివారించవచ్చని భావిస్తున్నారు.