కృష్ణ

కోలుకున్న కృష్ణమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరుగుతున్న కృష్ణా నది నీటిమట్టం
పాతబస్తీ, డిసెంబర్ 29: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది నీటిమట్టం పెరుగుతోంది. వారం క్రితానికి, నేటికి కృష్ణా జల కళలో తేడా వచ్చింది. శ్రీశైలం నుండి 10 టిఎంసిల నీటిని దిగువకు వదులుతాము, వాటిల్లో 6 టిఎంసిలు తెలంగాణ రాష్ట్రం తాగు నీటికి, మిగిలిన 4 టిఎంసిల నీరు ఆంధ్ర రాష్ట్రం తాగునీటికి వాడాలని సూచించినా శ్రీశైలం నీరు నాగార్జున సాగర్ దాటి ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. దాంతో గత ఏడాది డిసెంబర్‌లో ఉన్న నీటిమట్టం కంటే ఇప్పుడు గణనీయంగా తగ్గిన విషయం విదితమే. ఈ నెల 22వ తేదీన కేవలం 8.3 అడుగుల నీరు మాత్రమే నదిలో ఉంది. ఇది వేసవి కాలాన్ని గుర్తుకు తెచ్చింది. కృష్ణా నది ఎగువ నీటి రాకపై ఆశ వదులుకోవాల్సి వచ్చింది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం గణనీయంగా తగ్గడంపై రాజకీయ నాయకులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఈలోగా పులిచింతల ఎత్తిపోతల ద్వారా గోదావరి నదిని కృష్ణా నదిని అనుసంధానం చేసిన పోలవరం కాలువ గుండా రెండు రోజులుగా నీరు రావడంతో కృష్ణా నదికి జలకళ వచ్చింది. కృష్ణా నది నీటి మట్టం పెరిగింది. మంగళవారం నాటికి నీటి మట్టం 10.6 అడుగులకు చేరుకుంది. ఇంకా గోదావరి నీరు వచ్చి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. నిన్న మొన్నటి వరకు నీరు లేక ఉన్న నీరు మురుగు వాసన భరించలేకపోయామని, నేడు నీటి మట్టం పెరగడంతో నీరు ఎంతో శుభ్రంగా ఉందని కృష్ణవేణి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలి
* కాపుల అభ్యున్నతి కోసమే కాపు కార్పొరేషన్

పాయకాపురం, డిసెంబర్ 29: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని రెండో విడత రుణమేళా కార్యక్రమం ద్వారా 228 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక జనవరి మాసాంతానికి పూర్తి చేయాలని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో బిసి సంక్షేమ పథకాల అమలుపై మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 13 జిల్లాలకు చెందిన బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్‌తో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక పురోగతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు. పది సంవత్సరాలుగా బిసి లబ్ధిదారులకు కేవలం 71 కోట్లు మాత్రమే రుణాలు మంజూరు చేశారన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిసి వర్గాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు మొదటి విడ రుణమేళా ద్వారా 250 కోట్ల రూపాయలు 36 వేల మంది లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మొదటి విడత రుణమేళా రాష్ట్రంలోని 11 జిల్లాలలో పూర్తి చేశామని, కృష్ణా, చిత్తూరు జిల్లాలలో రుణాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. రెండవ విడత రుణమేళా ద్వారా 34 వేల మంది లబ్ధిదారులకు 228 కోట్ల రూపాయలను రుణాల కింద మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను జనవరి మాసాంతానికి తప్పనిసరిగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. యూనిట్లను నెలకొల్పి వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు లబ్ధిదారులకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో బ్యాంకు అధికారులు రుణాల మంజూరులో లక్ష్యాలను పూర్తి చేయలేకపోతున్నారని, బ్యాంకు ఉన్నతాధికారుతో సమావేశం నిర్వహించి లబ్ధిదారుల రుణాల మంజూరు చేసేలా చర్యలు తీసుకుని లక్ష్యాలు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో బిసి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.హర్షవర్ధన్, బిసి సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.కృష్ణమోహన్, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారిణి పుష్పలత, 13 జిల్లాలకు చెందిన బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.