తెలంగాణ

కోటి ఎకరాలకు నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సకాలంలో ప్రాజెక్టులు పూర్తి: కెసిఆర్
నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశం
హైదరాబాద్, మార్చి 14: రాష్టవ్య్రాప్తంగా సాగునీటిపారుదల ప్రాజెక్టుల పనులన్నీ ఏకకాలంలో ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సాగునీటికి బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్లు కేటాయించడంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదరడంతో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు తదితరులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాణహిత-కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్షిస్తూ టనె్నళ్లు ఎక్కడ నిర్మించాలి. రిజర్వాయర్లు ఎక్కడ నిర్మించాలి, ఎక్కడ పంపింగ్ చేయాలి? ఎక్కడికి గ్రావిటి ద్వారా నీళ్లు ఇవ్వాలి? తదితర అంశాలపై వచ్చిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి పరిశీలించారు. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉండటంతో సాధ్యమైనంత వరకు ఎక్కువ నీటిని పంప్ చేసేందుకు రిజర్వాయర్లు నిర్మించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దేవాదుల పంప్ హౌస్‌కు దిగువన బ్యారేజి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏడాది పొడవున నీరు అందుతుందని, దీని ద్వారా వరంగల్ జిల్లాలోని చాలా వరకు సాగునీటిని అందించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. తక్కువ ముంపు, ఎక్కువ ప్రయోజనం ఉండే విధంగా దేవాదుల ప్రాజెక్టును ఉపయోగించుకునేలా బ్యారేజి నిర్మించుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్టవ్య్రాప్తంగా కాళేశ్వరం, ప్రాణహిత, శ్రీ సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూడు, నాలుగేళ్లలో ప్రాజెక్టులన్ని పూర్తి చేసేందుకు ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. అధికారులు, కాంట్రాక్టు పొందిన సంస్థలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమన్వయంతో పనులు జరగేలా చూడాలని మంత్రి హరీశ్‌రావును ముఖ్యమంత్రి ఆదేశించారు.