జాతీయ వార్తలు

ఇరు రాష్ట్రాలకు దామాషా ప్రకారం నీటి పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కృష్ణా జలాల లభ్యత ఆధారంగా అంచనా వేసి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు దామాషా ప్రకారం నీటి పంపిణీని చేస్తామని, దీనిని ఇరు రాష్ట్రాలు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. కేంద్రం జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. కృష్ణా జలాల అంశంపై బుధవారం దిల్లీలో నిర్వహించిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో మూడు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. కృష్ణా జలాల విషయంలో కర్ణాటక, మహారాష్ట్ర వివాదంపైనా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. నదీ జలాల పంపకం అంశంలో వివాదాలకు పోకుండా.. సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకోవాలని ఉమాభారతి సూచించారు. అపెక్స్‌ సమావేశంలో నదీ జలాల పంపకంలో వివాదాల పరిష్కారంపై చర్చించినట్లు చెప్పారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి లభ్యతను అంచనా వేసేందుకు కేంద్రం, రెండు రాష్ట్రాల ఇంజినీరింగ్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. కమిటీ అధ్యయం చేసిన నివేదికను ట్రైబ్యునల్‌కు అందజేస్తుందని.. నీటి లభ్యత ఆధారంగా టైబ్యునల్‌ సూచనల మేరకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌, రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.