జాతీయ వార్తలు

స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇసిని కోరిన పశ్చిమ బెంగాల్ విపక్షాలు ఐదు నుంచి ఏడు దశల్లో నిర్వహించాలని విజ్ఞప్తి
కోల్‌కతా, డిసెంబర్ 10: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలూ గురువారం ఇక్కడ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి నసీమ్ జైదీని కలిశాయ. జైదీ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవల్సిన చర్యలపై సీనియర్ అధికారులతో కమిషన్ చర్చించింది. కాగా అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగాలంటే ఐదు నుంచి ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించాలని విపక్ష పార్టీలు సూచించాయి. ‘రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాం. ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా ఓటు వేయడానికి అనువైన పరిస్థితులు కల్పించాలని అభ్యర్థించాం’ అని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రొబిన్ దేవ్ సమావేశానంతరం మీడియాకు చెప్పారు. ఆరు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని మరోపార్టీ ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మనస్ భూనియా నాయకత్వంలోని ప్రతినిధివర్గం ఎన్నికలకు కేంద్ర బలగాలను పంపి పోలింగ్ స్వేచ్ఛగా జరిగేలా చూడాలని నసీమ్ జైదీకి విజ్ఞప్తి చేశారు. ‘ఐదు, ఆరు దశల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు సజావుగా సాగడానికి అదనపు బలగాలు దించాలి. ఓటర్లు నిర్భయంగా ఓటు వేసే పరిస్థితులు కల్పించాలి’ అని కమిషన్‌కు కోరినట్టు ఆయన తెలిపారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధివర్గం కమిషన్‌ను కలిసి ‘జనవరి 5 నాటికి ఓటర్ల జాబితాను ప్రకటించాలి’ అని కోరింది.