జాతీయ వార్తలు

బెంగాల్ బరిలో 244 మంది కోటీశ్వరులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 1,941 మంది పోటీ చేస్తుండగా, వీరిలో 244 మంది కోటీశ్వరులున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ అధ్యయనం జరిపారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు ఇచ్చిన ఆస్తిపాస్తుల వివరాలను పరిగణనలోకి తీసుకోగా ఎన్నికల బరిలో 244 మంది కోటీశ్వరులున్నట్టు తేలింది. వీరిలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి 114 మంది, బిజెపి నుంచి 46 మంది, కాంగ్రెస్ నుంచి 31 మంది, సిపిఎం నుంచి 13 మంది, బిఎస్పీ నుంచి నలుగురు, స్వతంత్ర అభ్యర్థుల్లో 19 మంది కోటీశ్వరులున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేల ఆస్తిపాస్తులు గత అయిదేళ్ల కాలంలో గణనీయంగా పెరిగినట్లు అధ్యయనంలో తేలింది.