వీక్ పాయింట్

పాపాల భైరవుడు దొరికాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరేంద్ర మోదీ... పక్కకు జరుగు!
నీకు తోడుబోయినవాడు ఇంకొకడొచ్చాడు.
మిడిమేలపు మీడియాకు కొత్త పాపాల భైరవుడు దొరికాడు.
క్రైమ్‌స్టోరీ లాగే సెక్యులర్ స్టోరీకీ హీరోకంటే విలన్ ముఖ్యం.
ఒక రాక్షసుడినంటూ చూపెడితే తప్ప-
జాతికి జీవాధారమైన పవిత్ర సెక్యులరిజాన్నీ, దాన్ని నమ్ముకుని బతుకుతున్న అమాంబాపతు వర్గాలనూ రాకాసి బారినుంచి కాపాడటానికి మేము మాత్రమే పోటుగాళ్లమని బుకాయిస్తూ బతికేందుకు-
నెహ్రూ బళ్లో చదువుకున్న జాతీయ, ప్రగతిశీల, సామ్యవాదులకూ- వారికొమ్ముకాసే లెఫ్ట్, లిబరల్, మూర్ఖిస్టు మేథావిగణానికీ - వారికి గొడుగుపట్టి బాగుపడే మిడిమిడి మీడియా అబద్ధాల కోర్లకూ - అవకాశం ఉండదు. నిజంగా అలాంటి రాక్షసుడెవడూ లేకపోతేనో...? నోట్లో వేలుపెట్టినా కొరకలేని మైనారిటీల అమాయకులను హిందూ మతోన్మాదుల బెడదనుంచి నిరంతరం సంరక్షించడమనే పవిత్ర సెక్యులర్ వ్రతం ఆగటానికి వీల్లేదు కాబట్టి అవసరార్ధం ఒక భూతాన్ని కృత్రిమంగా సృష్టించడమే అవశ్య కర్తవ్యం.
అలా సెక్యులర్ కనికట్టుతో మన మహేంద్ర జాలికులు పదిహేనేళ్ల కింద గోధ్రాగుండంలో పుట్టించిన పెనుభూతమే ‘‘అమ్మో, న.మో.!’’
అదేమి చిత్రమో! అరుంధతీ‘రాయి’లూ రప్పలూ - ‘తీస్తా’లూ, ‘బర్‌ఖా’లూ... కాంగ్రెసు ‘పప్పు’లూ, కమ్యూనిస్టు ‘కారా’త్‌లూ... ‘కేజ్రీ’లూ క్రేజీలూ, పగబట్టి, కత్తికట్టి, ఎంత దారుణంగా దాడిచేస్తే అంత అద్భుతంగా గుజరాత్ ప్రజలు వరసగా ప్రతి ఎన్నికలోనూ నరేంద్రభాయిని నెత్తిన పెట్టుకున్నారు. మోదీ వస్తే సెక్యులరిజం సర్వనాశనమేనని అతివాద, మతవాద, కులవాద, అవకాశవాద, కాంగ్రెసు బాండు పార్టీలన్నీ ఏకమై ఎంత గగ్గోలు పెట్టినా ‘హిందూ ఫాసిస్టు మతోన్మాది’ తిరుగులేని మెజారిటీతో ఏకంగా దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. దళితులూ ముస్లింలూ మోదీ పేరు చెబితే మండిపడుతున్నారని, కాంగ్రెస్ - ఎస్.పీ. దోస్తీవల్ల మైనారిటీ ఓట్లన్నీ మోదీకి వ్యతిరేకమేననీ మీడియా పక్షపాతులంతా కలిసి ఎంతలా కోడై కూసినా మొన్నటి ‘ఉత్తర’ జైత్రయాత్రలో మోదీ దిగ్విజయం సాధించాడు.
అభాండాల గదలతో ఏళ్లతరబడి విడవకుండా మోదీ మోదీ విరోధులకు చేతులు పుండ్లయి శోష వస్తున్నదే తప్ప నరేంద్ర నరాధముడు చెక్కు చెదరడం లేదు. బలహీనపరచాలని చూసినకొద్దీ ఇంకా ఇంకా బలవంతుడవుతున్నాడు. ఇక లాభం లేదు. కుహనా సెక్యులరిస్టు దుకాణాలు దివాలాతీయకుండా నడవాలంటే అర్జంటుగా ఇంకో దెబ్బలబ్బాయిని పట్టుకోక తప్పదు.
సెక్యులర్ దేవుళ్ళ దయవల్ల ఆ అక్కరా తీరింది. కొత్త పాపాత్ముడు ఎంచక్కా దొరికాడు. పేరు ఆదిత్యనాథ్ యోగి. ఉత్తరప్రదేశ్‌కి కొత్త ముఖ్యమంత్రి. ఆ పదవికి బొత్తిగా కొరగాడని, ఆ హిందూ మతోన్మాది రాజ్యంలో మైనారిటీలు బతికి బట్టకట్టలేరని, అతగాడి ఉనికే నాగరిక సభ్య సమాజానికి సవాలు, సెక్యులరిజానికి పెనుముప్పు అని ఇప్పుడు లెఫ్ట్, లిబరల్, మీడియా మేధావిగణాల కాకిగోల!
ఆదిత్యనాథ్ యోగి 26 ఏళ్ల పిన్న వయసులోనే పెద్ద మెజారిటీతో లోక్‌సభకు ఎన్నిక అయి ఉండొచ్చు. 1998 నుంచి నేటిదాకా ఐదు దఫాలు వరసగా ప్రతి ఎన్నికలోనూ అదే గోరఖ్‌పూర్ నుంచి లక్షల మెజారిటీతో పార్లమెంటుకు ఎన్నిక అవుతూనూ ఉండొచ్చు. అతని నియోజకవర్గంలో లక్షలమంది ముస్లిం ఓటర్లు ఉండొచ్చు. వారికి అతడంటే ఆదరాభిమానాలూ ఉండొచ్చు. అయినా సరే! అతడు కోన్‌కిస్కాగాడే. కాషాయం కడతాడు కాబట్టి హిందూ మతోన్మాదే. మైనారిటీలకు ముమ్మాటికీ ప్రమాదకారే! ‘హిందూ వాహిని’ నడిపాడు కాబట్టి, హిందూ వ్యతిరేకులపై పోరాడాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాక గ్యారంటీగా అతడు అన్యమతస్థులను నంజుకు తింటాడని నమ్మెయ్యవలసిందే.
ఎన్నికల ప్రచారంలో హిందుత్వం మాటెత్తి ఉంటేనేమో మోదీని హిందూ మతోన్మాది అనేవాళ్లు. ఆ మాటెత్తలేదు కనకేమో ఇప్పుడు హిందుత్వ వాదిని ముఖ్యమంత్రిగా పెట్టటానికి వీలే లేదంటున్నారు. మోదీకి ముస్లింలు ఓటు వెయ్యనే వెయ్యరని ఫలితాలకు ముందు శకునాలు పలికిన శకునులే ఇప్పుడు మోదీ అభివృద్ధి మంత్రాన్ని వలచి ముస్లింలు పెద్ద ఎత్తున ఓటేశారని బల్లగుద్ది గుర్తు చేస్తున్నారు. ముస్లింలు కూడా ఓటేశారు కనుక హిందూ కాషాయధారిని సి.ఎం.గా పెట్టటం ముస్లింలకు ద్రోహమని కొత్తరాగం లంకించుకుంటున్నారు.
హోరాహోరీ పోరులో నాలుగింట మూడొంతుల మెజారిటీని సాధించిన పార్టీకి తాను కోరుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసే హక్కు లేదు. ప్రచార పర్వం పొడవునా ఆ పార్టీని, దాని నేతను శాపనార్థాలు పెట్టి... ఆ రాష్ట్రం అంతటా ఉవ్వెత్తున వీచిన మోదీ ప్రభంజనాన్ని గుర్తించక కళ్లు, చెవులు మూసుకుని, ఏ గాలీ లేదని కడదాకా బొంకిన మీడియా పండితులు, విశే్లషకులు ఎవరిని వీటో చేస్తే వారిని ముఖ్యమంత్రిగా కొనసాగించటం నేరం. ఎన్నికల ప్రచారంలో మోదీకి తోడుగా యోగి రాష్టమ్రంతటా తిరిగి ప్రచారభారం మోసి, కనీసం వంద నియోజకవర్గాల్లో పార్టీ గెలుపుకు కారకుడైతేనేమి? ముస్లిం మహిళల శవాలను రేప్ చేయాలని వెనకెప్పుడో పలికినట్టు ఏ మీడియా చిలకకో కలవచ్చింది కాబట్టి అతగాడు ముమ్మాటికీ ముస్లిం మహిళలను చంపి రేప్ చేయించే పాపాత్ముడే! గోవధ నిషేధం, అక్రమ కబేళాల మూసివేత తన పార్టీ ఎన్నికల ప్రణాళికలో ముఖ్యాంశం అయితేనేమి? సెక్యులర్ యు.పి.కి ముఖ్యమంత్రి అయిన తరవాత గోవధను కొనసాగనివ్వవలసిందే. చట్టవిరుద్ధంగా నడుస్తున్న కబేళాలను మాత్రమే మూసివేయించినా సరే - ఘోరమేదో జరిగిపోతున్నట్టు సెక్యులర్ గోత్రీకులందరూ గగ్గోలు పెట్టవలసిందే. చట్టాన్ని ధిక్కరించి తెగిపడుతున్న గోమాతల తలకాయలను కాదు... పని పోయిన కసాయిల గోడును, గో మాంసం దొరకక ఘరానా హోటళ్లలో గోభక్షకుల కేకలను, జూలో జంతువుల ఆకలి బాధలను మాత్రమే పొద్దస్తమానం మీడియాలో చూపాలి. కాషాయ ముఖ్యమంత్రి ఏమి చేసినా, ఏమి పలికినా నిష్కృతి లేని నేరంగా పరిగణించకపోతే... అది సెక్యులరిజానికి నిష్కృతిలేని మహాపచారం.
చెడ తిట్టీ తిట్టీ మోదీని జనానికి ఇంకా చేరువ చేసినట్టే మన సెక్యులర్ శ్రోత్రియులు ఇక యు.పి. యోగిని కూడా తిట్టీ తిట్టీ జాతీయ వీరుడిని చేస్తారా?

-సాక్షి

-సాక్షి