సంజీవని

నెల తప్పితే... ఈ పరీక్షలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్భం ధరించిన వాళ్ళు రోగనిర్థారణ కోసం ఉదయమే మూత్రాన్ని సేకరించి పరీక్షకు పంపాలి. మూత్రంలో హ్యూమన్ క్లోరియోనిక్ గొనడోట్రోఫెన్ (హెచ్‌సిజి) అనే హార్మోన్ ఉంటే వచ్చిందని అర్థం. ఇది హూయోప్రెగ్నెన్సీ టెస్ట్! ఎవరికి వారే ఇంట్లో చేయించుకుని ఈ విషయం నిర్థారించుకోవచ్చు. అయితే నిబంధనలు జాగ్రత్తగా పాటించాలి. అనుమానముంటే వారం తర్వాత ఈ పరీక్షని మళ్లీ చేయాలి. గైనకాలజిస్ట్‌ని కలుసుకుంటే పరీక్షలు చేసి నిర్థారిస్తారు. రక్తపరీక్ష, మూత్ర పరీక్షలతోపాటు (హెచ్‌సిజి) హార్మోన్ కోసం రక్త పరీక్ష చేస్తారు.
గర్భం ధరించినట్లు ఎందుకు త్వరగా తెలుసుకోవాలంటే, అవసరమైన మందుల్ని సకాలంలో మొదలుపెట్టడానికి వీలవుతుంది. కోరియోనిక్ విల్లస్ సాంప్లింగ్ (సివిఎస్) లాంటి పరీక్షలు చేసి రిస్క్ ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. గర్భం వద్దు అనుకునేవారు మొదటి వారాల్లో తెలుసుకుంటే గర్భస్రావం చేయించుకోవడానికి వీలుంటుంది.
గర్భస్థ శిశువు మొదటి మూడవ నెలలో చాలా వేగంగా పెరుగుతుంది. మొదటి నెలలో జైగోట్ కణ విభజన చెంది, బిడ్డకు తల్లి నుంచి ఆహారం వెళ్ళడానికి ప్లాసెంటా (మాలి) ఏర్పడుతుంది. మొదటి నెల పూర్తయ్యేసరికి పిండం అయిదు మిల్లీ మీటర్‌ల పొడవుంటుంది. రెండో నెల కాళ్లు, చేతులు ఏర్పడటం మొదలవుతుంది. రెండో నెల చివరకు పిండం 25 మిల్లీ మీటర్ల పొడవవుతుంది. మూడో నెల నుంచి గర్భస్థ శిశువుగా భావిస్తారు. లింగ నిర్థారణ అయ్యేది మూడో నెలలోనే! మూడో నెల పూర్తయ్యేసరికి గర్భస్థ శిశువు 60 మిల్లీ మీటర్ పొడవవుతుంది. ఆరోనెల వచ్చేవరకూ అవయవాలు పెరుగుతాయి. గర్భంలోని ఆఖరు మూడు నెలల్లో గర్భస్థ శిశువు సంపూర్ణంగా ఎదుగుతుంది.
గర్భం దాల్చగానే వివిధ స్థాయిలలో
చేయించుకోవలసిన
ఆధునిక పరీక్షల వివరాలు
గర్భం ధరించిన వెంటనే రక్తపోటు, బ్లడ్‌కౌంట్, బ్లడ్ టైపింగ్, మూత్రంలో సుగర్ స్థాయి, మూత్ర పరీక్షలు, సిఫిలిస్, గనేరియా, ఎయిడ్స్‌కి సంబంధించిన పరీక్షలన్నీ చేయించడం అవసరం. అన్నీ బాగున్నపుడే గర్భాన్ని కొనసాగనివ్వాలి.
అల్ట్రాసౌండ్ పరీక్ష: ఇందులో ఎటువంటి రేడియేషన్ ఉండదు. ఒక ప్రోబ్‌ని పొట్టమీద రుద్దుతూ హైఫ్రీక్వెన్సీ తరంగాలను పొట్టలోకి పంపుతారు. అల్ట్రాసౌండ్ ద్వారా కడుపులోని నిర్మాణాలు ఎలక్ట్రానిక్ సిగ్నల్స్‌గా మారి స్క్రీన్ మీద ఇమేజ్ ఏర్పడుతుంది. గర్భస్థ శిశువు ఎలా వున్నది కనబడుతుంది. ఈ పరీక్షతో గర్భస్థ శిశువు వయసు కూడా తెలుసుకోవచ్చు. కవలలున్నా తెలుస్తుంది. గర్భస్థ శిశువు గుండె, వెన్నుపాము, మెదడు లోపాలున్నా ఈ అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ‘ప్లసెంటా ప్రీవియా’ అంటే మాలి పొర యుటెరస్ మూతిని మాలి మూసివేస్తుంది. ఇది కూడా ఈ పరీక్షలో తెలుస్తుంది.
అల్ఫాఫిటో ప్రొటిన్ టెస్ట్ (ఎఎఫ్‌పి) పరీక్ష: గర్భం ధరించిన 14-16 వారాల మధ్య దీనిని చేయించుకోవాలి. గర్భస్థ శిశువులో మెదడు, వెన్నుపాము, ఆహార నాళ లోపాలుంటే ఎఎఫ్‌పి లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి.
‘అమ్నియో సింధసిస్’ పరీక్ష: 16-20 వారాల గర్భ సమయంలో చేయించుకోవాలి. ఒక సూదిని యుటెరస్ ద్వారా గర్భాశయంలోకి పంపి ఉమ్మ నీటిని తీసి పరీక్షిస్తారు. జెనిటిక్ డిజార్డర్స్ శిశువులో ఉంటే తెలుసుకోవచ్చు.
కొరియానిక్ విల్లస్ సాంప్లింగ్ పరీక్ష: దీనిని గర్భం ధరించిన 8 నుంచి 10 వారాలలో చేయించాలి. ఒక ట్యూబ్‌ను జననాంగం ద్వారా యుటెరస్ వరకు పంపి, గర్భస్థ శిశువు చుట్టూ వున్న కణాలను కొన్నింటిని సేకరించి పరీక్షిస్తారు. అమ్నియో సెంటెసిస్ కన్నా ముందు గర్భస్థ శిశువు లోపాల్ని పసిగట్టవచ్చు.
ఫిటోస్కోప్ పరీక్ష: గర్భం ధరించిన 18-20 వారాలమధ్య దీనిని చేయించాలి. కడుపులో సన్నటి రంధ్రం చేసి ఫైబర్ అస్టిక్ ట్యూబ్‌ని యుటెరస్‌లోకి పంపుతారు. అలా పంపి గర్భస్థ శిశువుని చూడవచ్చు. ఈ పరీక్ష ద్వారా గర్భస్థ శిశువు రక్తాన్ని తీసుకుని కొన్ని లోపాలను శిశువు జన్మించకముందే సరిచేయవచ్చు.

ప్రశ్న-జవాబు

ఎథిరోస్ల్కీరోసిస్‌తో ఎలాంటి ఇబ్బందులు వస్తాయ?
- ఎథిరోస్ల్కీరోసిస్‌లో రక్తం ప్రసరించే దారి సన్ననై పోతుంటుంది. క్రమంగా మూసుకుపోవచ్చు కూడాను. దాంతో ఆ తర్వాతి కణాలకి రక్తం సరిగా చేరక ఆక్సిజన్, ఆహారం అందక దెబ్బతింటాయి. ఐతే గుండె రక్తనాళాలలో కరొనరి ఆర్టెరిలలో ఇలా అడ్డంకులేర్పడితే గుండెపోటు వస్తుంది. మెదడుకి రక్తం సరఫరా చేసే కెరోటెడ్ ఆర్టెరీలలో అడ్డంకులేర్పడితే స్ట్రోక్ పక్షవాతం వస్తుంది. ఏ ప్రాంతానికి రక్తసరఫరా ఆగిపోయినా ఆ ప్రాంత పనితీరు దెబ్బతింటుంది. అవయవాల భాగాలు కుళ్ళిపోతుంటాయి. దానినే ‘గాంగ్రీన్’ అంటాం. దానినలా వదిలేస్తే పై భాగాలకు వ్యాపించవచ్చు.
ఆర్టిరియో స్ల్కీరోసిస్‌కి ఎథిరోస్ల్కీరోసిస్‌కి తేడా ఏమిటి?
- ఆర్టిరియో స్ల్కీరోసిస్ అంటే రక్తనాళాలు గట్టిపడడం. మామాలుగా ఆర్టెరి గోడలు లాంటి జబ్బుల సమూహాన్ని ‘ఆర్టిరియో స్ల్కీరోసిస్’ అంటారు. వయసు పెరిగేకొద్దీ ఆర్టెరి గోడలకు కొవ్వు పేరుకుపోయి లోపల రక్తం ప్రవహించే దారి సన్ననైపోతుంటుంది. దాంతో రక్తప్రసరణకు అడ్డంకులు కలుగుతుంటాయి. దీనిని ఎథిరోస్ల్కీరోసిస్ అంటారు.

డా.ఆలూరి విజయలక్ష్మి గైనకాలజిస్ట్.. 9849022441