ఆటాపోటీ

‘జికా’పై బ్రెజిల్ అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెజిల్‌లో ఒలింపిక్స్ సంవత్సరం సంబరాలకు ‘జికా’ వైరస్ అడ్డుకట్ట వేస్తున్నది. రియో డి జెనీరోలోని క్రీడాభిమానులు సంబరాలు జరుపుకోవడానికి కూడా వెనుకాడుతున్నారు. చిన్న పిల్లల్లో మెదడు పెరగకుండా అడ్డుకొని, కొన్ని సందర్భాల్లో వారి మృతికి కారణమవుతున్న జికా వైరస్‌ను ‘ఎడెస్ ఈజిప్టీ’ జాతికి చెందిన దోమలు వ్యాప్తి చేస్తున్నట్టు వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. గర్భిణులకు ఈ వ్యాధి సోకితే, మెదడు ఎదగకుండా పిల్లలు పుడతారు. ఈ విషయాన్ని గుర్తించిన బ్రెజిల్ ప్రభుత్వం జికా వైరస్‌పై అప్రమత్తమైంది. ఈఏడాది ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఒలింపిక్స్‌ను చూసేందుకు రావద్దని గర్భిణులకు సూచించింది. ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు పలు కేంద్రాల్లో నిర్మాణాలు ఇప్పటికే పూర్తికాగా, మరికొన్ని చివరి దశకు చేరుకున్నాయి. కొన్ని నెలల క్రితం వరకూ రియోలో మీద ఎక్కడ చూసినా ఒలింపిక్ సంబరాలు కనిపించాయి. కానీ, హఠాత్తుగా జికా వైరస్ వ్యాప్తి కారణంగా ఉత్సాహం ఒక్కసారిగా అడుగంటిపోయింది. అప్రమత్తంగా ఉండాల్సిందిగా బ్రెజిల్ రాష్టప్రతి డిల్మా రూసెఫ్ ఇప్పటికే ప్రకటన జారీ చేసింది.