గ్రహానుగ్రహం

జ్యోతిషం సైన్స్ అనవచ్చా? ( గ్రహానుగ్రహం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సావిత్రి (నెల్లూరు)
ప్రశ్న: సైంటిస్టులు గతంలో మూడు గ్రహాలను కనుగొన్నారు కదా! వాటి ప్రభావం జ్యోతిషంలో కూడా ఏమైనా ఉంటుందా?
జ: టీవీ ఛానెళ్ళలో మన సంస్కృతికి సంబంధించిన ఆధ్యాత్మికవేత్తలను, స్వామీజీలను ఈ విషయంలో అపహాస్యంగా మాట్లాడి అవమానం చేశారు. ఖగోళంలో ఉన్న ఆ మూడు గ్రహాల వలన భూత భవిష్య వర్తమానాలలో ఏ విధంగానూ ఉపయోగం లేనివే అని నా నమ్మకం. ఒకవేళ వాటితో ఉపయోగం ఉంటే భవిష్యత్‌లో వాటి ఉపయోగం కనుక్కోవడం ఆలస్యం కావొచ్చు కానీ గతంలో ఈ నూతన గ్రహాలు ఖగోళంలో ఏం చేశాయి అన్న అంశం తేలికగా కనిపెట్టే వాళ్లు మన ఖగోళ శాస్తవ్రేత్తలు. అప్పుడు హడావిడి చేసి మరలా ఇప్పటిదాకా దాని గురించి చర్చించలేదు అంటే అవి నిరుపయోగ పదార్థాలు అని గ్రహించి ఉంటారు శాస్తజ్ఞ్రులు. కనపడిన ప్రతి దానికీ జ్యోతిష శాస్త్రంతో ముడిపెట్టవలసిన అవసరం లేదు. అలాగే జరిగే ప్రతి పిచ్చి ఘటనలకు జ్యోతిష శాస్త్రంలో అధ్యయనం లేదు. ఇప్పటిదాకా గతంలో ఆ మూడు గ్రహాల వలన భూమికి ఏ విధమయిన ప్రయోజనం చేకూరలేదు. అదే రీతిగా వాటి కక్ష్య, గమనం వివరాలు కూడా విడుదల చేయలేదు. ఇంతకాలం అవి ఏం చేశాయి అనే విషయం తెలుపలేదు. మన తరం వాటి వివరాలు పొందలేదు. తర్వాతి తరానికి అవసరం లేదు. కాబట్టి ఈ మూడు గ్రహాలు నిరుపయోగ గ్రహాలు.
రాజశేఖర్ (హైదరాబాద్)
ప్రశ్న: కొందరు జాతకాలు కరెక్ట్‌గా చెబుతారు. మరి కొందరు తప్పు చెబుతుంటారు. ఇంతకీ శాస్త్రం సైన్స్ అయితే ఎందుకు ఈ తేడాలు? జ్యోతిషం సైన్స్ అనవచ్చా?
జ: ఈ విషయంలో మరొక సబ్జెక్ట్ పరిశీలిద్దాం. వైద్య శాస్త్రం సైన్స్ కదా! అయితే ఏదేని రోగం విషయంలో కొందరు డాక్టర్లు సక్సెస్ అవుతారు. కొందరు ఫెయిల్ అవుతారు. ఇరువురూ ఒకే రకం ప్రాసెసింగ్ చేసినా ఫలితాలలో తేడా ఉంటుంది. ఒకే రకమైన రోగం కానీ పేషెంట్ పరిస్థితి ప్రకారం అనుభవజ్ఞుడయిన వైద్యుడు విధానాలు మార్పు చేసుకుంటూ సక్సెస్‌ఫుల్ వైద్యం చేస్తాడు. సక్సెస్ అయిన డాక్టర్ దృష్ట్యా వైద్యం ‘సైన్స్’ అనీ, ఫెయిల్ అయిన డాక్టర్ దృష్ట్యా వైద్యం ‘సైన్స్ కాదు’ అని నిర్ధారించకూడదు. అదే రీతిలో జ్యోతిషం చెప్పడంలో ఫెయిల్ అయిన దృష్ట్యా ‘జ్యోతిషం సైన్స్ కాదు’ అని నిర్ధారించకూడదు. జ్యోతిషంలో ఇచ్చిన విధానాలు సరైన పద్ధతిలో అమలుచేయక సిద్ధాంతి తప్పు చెప్పవచ్చు. పరిస్థితులకు తగిన విధంగా మార్పు చేసి చెప్పలేక పోయి ఉండవచ్చు. కానీ అది జ్యోతిషం చెప్పేవారి తప్పు కానీ శాస్త్రం తప్పు మాత్రం కాదు. జ్యోతిషం తొమ్మిది గ్రహాలు, 12 రాశులు, 12 భావములు, 12 లగ్నములకు మధ్య జరిగే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. వీటిలో ప్రతిరోజూ మార్పులు సంతరించుకుంటూ ఉంటాయి. దీన్ని సైంటిఫిక్‌గా పూర్వీకులు నిరూపించారు.

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336