అక్షరాలోచన

‘నీ రూపం కాంచినందులకేనా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతీ! కనులకేల ఇంత బాధ
నీ రూపం కాంచినందులకేనా
నాలోకి నీ రూపం కొనిపోయినందులకేనా
నా గుండె గుడిలో నీవు
ప్రేమ దేవతవై కొలువయేందుకు
సహాయపడిన కనులకెందుకీ శిక్ష
వాగులు, వంకలు, పంట పొలాలు
పొద్దు పొడుపూ, సంధ్యాసమయం
పండు వెనె్నల, ఇంద్రధనస్సు
వంటి ఎన్నో వింతలతో
ప్రకృతి కనువిందు చేస్తుందనుకున్నా
కానీ ప్రకృతే వింతగా నీ రూపంలో
హర్షాతిరేఖాలు కలుగజేస్తూ వస్తూ
చూసిన కనులే ఉబ్బితబ్బిబై పోయే విధంగా
వసంతాల వరాలు కురిపిస్తూ నీ వస్తుంటే
ఎంత ముచ్చటేసిందో కనులకు,
ప్రేమ బంధంతో నీకు దగ్గరవుతాను
అనుకున్నాను కానీ నీవేమో
నీకేమి కానంటూ నీ దారిలో నీవు
ఎలా వచ్చావో అలా వెళ్లిపోతుంటే
గుండెను రంపంతో కోసి
నీ జ్ఞాపాల్ని కూడా తీసుకెళ్తుంటే
తమ జన్మధన్యమైందని
ఎనె్నన్ని కలలు కన్నాయో
అవన్నీ కల్లలైనాయని తెలిసి
తమలో నిండిన నీ రొపానే్న
తలచుకొంటూ వలవల ఏడుస్తూ
తమను మోడువార్చద్దని
విలపిస్తూ విన్నవిస్తున్నాయి.

పాషాణ హృదయాలు

-బి.శ్యాంకుమార్
8125336089
అంతంలేని ఆకాశం
ఇంద్రధనస్సు కోక కట్టి
నలుదిక్కులా నాట్యంచేస్తూ
పరిహాసంగా నవ్వేస్తుంది

మేఘాల మేలిపర్వతాలు
మెరపుల ప్రకంపనలు
పిడుగుల పిలుపులు
వర్షం కురియని గర్జనలు

నదీ ప్రవాహంలో
సుడిగుండాలు
మత్స్యకారుల బతుకులు
నిత్యం యమగండాలు

ఉవ్వెత్తున యెగసిపడే అలలు
రాత్రిళ్లు చెరగని కలలు
ఆటుపోట్లతో కరగని శిలలు
కరిగేనా పాషాణమైన మనసులు

పక్షుల పలకరింపు
-తంగిరాల సోని
9676609234
మానవాళి మలిన మస్తిష్కంలో
ప్రకృతిని పరివిధాలుగా పరిహసిస్తే
విజేత వినాశనమే!
నిరుపేదల గుండెల్లో కన్నీళ్లు
పీక్కుపోయిన కనుగుడ్లు
బీడులైన పొలాలు
బువ్వలేని రైతు
కువకువరాగాలు లేని పల్లెలు
పక్షుల పలకరింపైన లేని
ఈ నేల మనది కానపుడు
జీవితమే అగమ్యగోచరం
వినాశనమే విజేత

స్పర్శ

-శ్రీశైలపు రామకృష్ణ
9704558263
స్పర్శ
స్పర్శతో ఏర్పడే లోగిలి
అంటేనే ఎంతో మధురమైనది.
నిజంగా అనుభవించాలే కాని
స్పర్శ తాలూకు విలువేంటో
ప్రత్యేకంగా తెలియదు
ఒక మాతృమూర్తి పుత్రోత్సాహంతో
తన బిడ్డను అనునయించటంలో
కలిగే స్పర్శ అనిర్వచనీయం!
వత్సరానికో సందర్భంగా పండుగనాడు
ఓ సోదరి
రాఖీకట్టే ప్రక్రియలో తన మునివేళ్లు
మణికట్టుకు తగులుతూంటే
పొందే స్పర్శ అద్వితీయం ;
తాళి కట్టించుకొన్న ఆలి
అలసిసొలసి ఇంటికి వచ్చిన భర్తకి
కాఫీ ఇవ్వటంలోనే సఫలమయినా,
ఆనక వేడెక్కిన మగడి నుదుటిన
ఆప్యాయంగా అరచేతితో అద్దితే
ఒళ్లంతా ఒక్కసారిగా పులకరించి
చల్లబడుతుంది చూడు...
ఆ స్పర్శ అజరామభరితం!
స్పర్శ స్వచ్ఛమైనది అయితే చాలు
ఆ స్పర్శ ఆ దేవుడే ఈ మనిషికందించిన
ఓ గొప్ప నిధి అవుతుంది.
తరతరాలు కీర్తించబడ్డ వరాల
మూటవుతుంది!!

-ప్రణవశ్రీ 9441571970