వీక్లీ సీరియల్

ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్!! -4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ ఒకచోట సమావేశమయ్యాక హెడ్ పిల్లల్నుద్దేశించి మాట్లాడింది.
‘డియర్ స్టూడెంట్స్! చదువు చదువూ అని బోర్ ఫీలవకుండా మిమ్మల్ని ఉల్లాసపరచాలనే ఉద్దేశంతో.. రొటీన్‌కి భిన్నంగా సరదాగా సందడిగా గడపాలని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాం.
ఈ పిక్‌నిక్ ప్రోగ్రామ్ మీకొక మధురానుభూతిగా మిగిలిపోతుందని నా నమ్మకం. నేటి ప్రోగ్రామ్ షీట్ ప్రకారం ముందుగా పది పదిహేను నిమిషాల పాటు ఫిజికల్ ఎక్సర్‌సైజులుంటాయి. ఆ తర్వాత జాలీ జాలీగా వుండే కార్యక్రమాలుంటాయి.
అవి ఏంటో నేనిప్పుడే చెబితే థ్రిల్లింగ్‌గా ఉండదు మీకు. వెయిట్ చెయ్యండి. మీరే బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ బీ రెడీ!’ అంటూ ముగించింది.
గేమ్స్ టీచర్ మేరీని పిలిచి తదుపరి కార్యక్రమం కండక్ట్ చేయమని ఆదేశించింది.
మిగతా టీచర్స్ పిల్లలకి వేడివేడి పాలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు.
దాదాపు పది నిమిషాలు పిల్లలతో శారీరక్ చేయించింది మేరీ టీచర్. తర్వాత ఫైవ్ మినిట్స్ రెస్టిచ్చింది.
టీచర్స్ తమ బ్యాచ్‌ల వారగా పిల్లలకి పాలూ బిస్కట్లు సప్లై చేశారు. కాసేపు రిలాక్సయ్యాక నెక్ట్స్ ప్రోగ్రామ్‌కి సమాయత్తమయ్యారు.
కింద రెండు కార్పెట్స్ పరిచి అందరూ ఒక వలయాకారంలో కూచున్నారు. కార్యక్రమ నిర్వహణ బాధ్యత డాన్స్ టీచర్ సుధారాణికి అప్పగించబడింది.
అందరూ ఉత్సాహంగా ఉన్నారు.
కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అందామె.
‘మన మధ్యలో ఉంచబడిన ఈ ప్లాస్టిక్ బుట్టలో కొన్ని చీటీలున్నాయి. ఒక్కొక్కరూ వెళ్లి ఒక చీటీ తీసుకొని తిరిగి మీమీ స్థానాల్లో కూర్చోవాలి. మీరు ప్రదర్శించాల్సిన రకరకాల అంశాలు ఆయా చీటీల్లో ఆల్రెడీ రాయబడి వున్నాయి.
నేను పిలిచిన వారు వచ్చి తమతమ చీటీల్లో రాసి వున్న అంశాన్ని అందరికీ వినపడేలా చెప్పాలి. తర్వాత ఆ అంశాన్ని అందరి ముందూ ప్రదర్శించాల్సి ఉంటుంది. మీతోపాటుగా మేమంతా కూడా ఈ ‘్ఫన్ గేమ్’ ప్రోగ్రామ్‌లో పాలుపంచుకుంటాం. ఓకె!’
‘ఈ రోజు పేపర్ చూశారా?’ నవ్వడం ఆపి అడిగాడు.
‘ఇంకా చూళ్లేదు’ సమాధానమిచ్చాడు యస్సై.
‘స్పెషల్ న్యూస్ ఏమై వుంటుందబ్బా’ అనుకున్నాడు మనసులో.
తన టేబుల్ పైనున్న ఓ ప్రముఖ తెలుగు డైలీని వేద ముందుకి తోసి, అండర్‌లైన్ చేయబడిన న్యూస్‌ని చదవమన్నాడు.
వేదవ్యాస్ చదవడం ప్రారంభించాడు.
ఆ న్యూస్ సంక్షిప్తంగా వుందిలా.
తొలిసారిగా ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక జీవో జారీకి కారణభూతమవుతూ పిన్నవయసురాలైన ప్రకాశం జిల్లా కనిగిరి నివాసిని చల్లా రమ్య అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఏడవ తరగతి పరీక్షలు రాయబోతోంది.
చదవడం పూర్తయ్యాక టేబుల్ మీద పెట్టేశాడా పేపర్‌ని.
‘చూశారాగా ఆ న్యూస్‌ని! ఇలాంటి వండర్ కిడ్స్ అరుదుగా ఉంటారు’ అన్నాడు ద్వివేది తన కళ్లద్దాల్ని సవరించుకుంటూ.
బదులుగా వేద తలపంకించాడు.
‘ఈ అమ్మాయి సెవన్ ఇయర్స్‌కి సెవెన్త్ పరీక్షలు రాస్తే తథాగత అవతార్ తులసి అనే బీహార్ కుర్రాడు తొమ్మిదేండ్లకే పదవ తరగతి పాసై ప్రపంచ రికార్డు సృష్టించాడ్సార్. చదువులో అనన్యమైన ప్రతిభ కనబరుస్తున్నాడట’ తనకి తెలిసిన మరొక విషయాన్ని ప్రస్తావించాడు వేద.
‘వీళ్లే కాదు. కొరియా దేశస్థుడైన కిమ్ అనే బాలుడి ఐక్యూ 210 దాటిందట. అది కాదు వింత. నాలుగు సంవత్సరాలే వున్న ఆ పిల్లాడు నాలుగు భాషల్లో అనర్గళ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ చూపరులని అబ్బురపరుస్తున్నాట్ట’
‘నిజమే సర్! మేధతో సంబంధం లేనివి కూడా మహా మహా మేథావుల్ని సైతం విస్మయానికి గురిచేసే రకరకాల కలియుగాద్భుతాలు అడపాదడపా చోటు చేసుకుంటున్నాయి. పేపర్లలో చూస్తూనే వున్నాం. అంతెందుకు మన రవీంద్రనాథ్ ఠాగూర్ పదకొండేళ్లకే కవిత్వం రాయడం మొదలుపెట్టి సాహితీ లోకంలో సంచలనం సృష్టించడం మనకు తెలిసిందేగా?’
‘తన ఏడవ ఏటే గణాంక పట్టికల్ని వివిధ రీతిలో తయారుచేసి ప్రపంచ గణిత శాస్త్ర రంగానే్న ఆశ్చర్యసాగరంలో ముంచలేదా సర్ సి.వి.రామన్. వీళ్లంతా పిన్న వయస్సులోనే ఇన్ని అద్భుతాలు ఎలా సృష్టించ గలుగుతున్నారు? ఎవరైనా రీజనింగ్ చెప్పగలిగారా? నో!’ పెదవి విరిచాడు ద్వివేది.
వాళ్ల సంభాషణని ఇంట్రస్ట్‌గా వింటున్న స్టేషన్‌లోని మిగతా కానిస్టేబుల్స్ విస్తుపోతున్నారు. వాళ్ల మాటల్లో దొర్లుతున్న ఆశ్చర్యకర విషయాల్ని విని కాదు. ఆ ఇద్దరి మేథాసంపత్తికి!
వేద వౌనంగా ఉండిపోయాడు.
‘అపారమైన తెలివితేటల్తో, అపురూపమైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించే ఇలాంటి బాల మేధావులు ఎందరో వున్నారు. అతి చిన్న వయస్సులోనే అత్యంత ప్రతిభ కనబరుస్తూ నాడూ నేడూ ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట సంచలనం సృష్టిస్తూనే ఉంటారు.’
ఇలాంటి వాళ్లతో ఆ కుర్రాణ్ని పోల్చడమా? నెవ్వర్! యాక్సిడెంటల్‌గా బెలూన్స్‌తోపాటు గాలిలో ఎగిరుంటాడు. దట్సాల్. ఇంత దానికే ఆ పిల్లవాడి మీద ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వద్దు. అనవసరంగా ఆలోచించి మైండ్ పాడుచేసుకోకండి’ అంటూ కొట్టిపారేశాడు ద్వివేది.
మామూలుగా కుర్రకుంక అని తను తేలిగ్గా తీసిపారేసిన అఖిల్‌కి, తమకి మధ్య ఒక బంధం ఏర్పడబోతోందని సి.ఐ. ద్వివేదికి తెలియదా సమయంలో?
కానీ వేద మాత్రం ఎందుకో అఖిల్ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేక పోతున్నాడు.
మెదడుని ఆలోచనలు తొలిచేస్తుంటే, ‘అఖిల్‌లో కూడా ఏదో స్పెషాలిటీ ఉందన్పిస్తోంది సర్!’ అని మాత్రం అనగలిగాడు.
‘ఒక వ్యక్తిలో అద్భుత శక్తులుండటమంటే సామాన్య విషయం కాదు. అది గాడ్ గిఫ్ట్’ బదులిచ్చాడు ద్వివేది.
ఏకాభిప్రాయం కురదనపుడు ఎక్కువ మాట్లాడ్డం అనవసరమనుకున్నాడు వేదవ్యాస్. అందుకని నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
వాస్తవానికి గర్భస్థ శిశువుగా ఉన్న అమృతఘడియల్లోనే అఖిల్‌కి గాడ్ గిఫ్ట్ లభించిందని..
అతడిలోని ఆ అద్భుత శక్తేంటో ప్రపంచానికి తెలియపరచే సంఘటనకి సుముహూర్తం నిర్ణయించబడిందా రోజేనని..
వాళ్లకేం తెలుసు?
* * *
మాట్లాడమంటే అఖిల్ ఏదో ఒకటి గలగలా మాట్లాడగలడు. రకరకాల ప్రశ్నలతో ఎదుటి వారిని బెంబేలెత్తించగలడు. అలాంటిది చీటిలో రాసినట్లుగా డాన్స్ చేయాలంటే మాత్రం గుండె దడ ప్రారంభమయ్యిందతనిలో.
అందుకే అందరి వైపు బెరుగ్గా చూశాడు.
ఆ కుర్రాడింకా నిల్చున్న చోటు నుండి కదలక పోయేసరికి, ‘నిట్టూ.. కమాన్ త్వరగా వచ్చేసేయ్’ అంటూ ఎంకరేజ్ చేసింది సుధా మేడమ్.
సంకోచిస్తూనే అడుగులో అడుగు వేస్తూ అందరి మధ్యలోకి వచ్చాడు.
(ఇంకా వుంది)

-ఎనుగంటి వేణుగోపాల్ 9440236055