వీక్లీ సీరియల్

డార్క్ అవెన్యూ-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిఐ దుర్జన్‌కుమార్ ఎట్టకేలకు నోరు విప్పారు. తాను నోరు విప్పకపోతే తన నోరు శాశ్వతంగా మూతపడుతుందన్న భయం అతనిలో మొదలైంది. ఎప్పుడైతే భయం మనిషిలో మొదలవుతుందో అప్పుడే మనిషిలో మార్పు మొదలవుతుంది. ఆ మార్పు ఎలాంటిదైనా కావచ్చు. ముందు డబ్బు కావాలనుకున్నాడు. డబ్బు కావాలా? నిజాయితీగా డ్యూటీ చేయడం కావాలా? అన్న ప్రశ్నకు డబ్బే ముఖ్యం అనుకున్నాడు.. నిజాయితీని అమ్ముకున్నాడు.
ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం చేసే పని అతనూ చేశాడు.
కానీ ఇప్పుడు ప్రాణం కావాలా? అనే ప్రశ్న వచ్చేసరికి నిజం బయటకు వచ్చింది. ప్రాణ భయం వెంటాడింది.
* * *
‘నన్ను ఈ రొంపిలోకి దింపింది నాకు డబ్బు ఆశ చూపించింది..’ అంటూ ఆగాడు.
డిసిపి అవినాష్‌కు కూడా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని వుంది. ఇన్నాళ్లు పెండింగ్‌లో వున్న కేసు ముడి విడిపడబోతుంది.
ఒక్క క్షణం గాఢంగా విశ్వసించి చెప్పాడు.
‘ఎస్పీ వర్మ.. శివప్రసాద్ వర్మ.. చంద్రకళ తోడబుట్టిన అన్నయ్య’
ఒక్క క్షణం అలానే ఉండిపోయింది భార్గవి.. ఆమె ఊహకు కూడా అందని విషయం.. తండ్రిలా చూసుకోవాల్సిన మేనమామ చెల్లెలిని చంపాలని అనుకోవడం.. మేనకోడలిని రేప్ చేయించి పిచ్చిదానిలా ముద్ర వేయడం..
నాకు క్లుప్తంగా చెప్పడం కాదు. మొదటి నుంచి ఏం జరిగిందో నాకు తెలియాలి. వివరంగా చెప్పు’ అన్నాడు సమీర్ సిఐ దుర్జన్‌కుమార్ చెప్పడం మొదలుపెట్టాడు.. ఆ పోలీసుస్టేషన్ ఒక చీకటి నిజం తాలూకు వికృత రూపం చూస్తోంది.
‘కొన్ని నెలల క్రితం ఢిల్లీ నుంచి శివప్రసాద్ వర్మ నా దగ్గరికి వచ్చాడు తన చెల్లెలి ఫొటో, చెల్లెలి కూతుళ్ల ఫొటోస్ నాకు ఇచ్చాడు. వీళ్లు నా పోలీసుస్టేషన్ పరిధిలోనే వున్నారని వారిని వెతికి పెట్టమని చెప్పాడు. యాభై వేలు కూడా ఇచ్చాడు.. ఒక పోలీస్ ఆఫీసర్‌గా నాకు వాళ్ల ఆచూకీ కనిపెట్టడం పెద్ద కష్టం కాలేదు. వాళ్లు ఎక్కడ వున్నారో చెప్పాను.. అక్కడి నుంచి శివప్రసాద్ వర్మ చెప్పినట్టు చేయసాగాను.. నేను చేసే ప్రతీ పనికి అతను డబ్బు ఇస్తూ వచ్చాడు’ ఆగాడు దుర్జన్‌కుమార్.
‘అంటే ఎలాంటి పనులు?’ సమీర్ అడిగాడు.
శివప్రసాద్ వర్మ నాన్నగారికి ఒక నిధి వుంది. ఆ నిధి స్వంతం కావాలంటే ఆ నిధి వారసులను బలి ఇవ్వాలి.. తమకు తాముగా ఆ బలికి సిద్ధం కావాలి. ఆ నిధికి వారసులు శివప్రసాద్ వర్మ.. చంద్రకళ.. ఈ ఇద్దరిలో బలికి సిద్ధం అయ్యేది ఎవరు?
తన చెల్లెలిని బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.. తనకు తానుగా బలికి ఆమె సిద్ధం కదా.. అందుకే అతను ఒక ప్లాన్ సిద్ధం చేశాడు. చంద్రకళకే నమ్మకాలూ ఎక్కువ.. భయాలు ఎక్కువ...
ఈ భయాలను ఆసరా చేసుకుని, ఆమె భర్తకు ఆస్తిలో నష్టం వచ్చినట్టు నమ్మించాడు. చంద్రప్రభ ప్రమాదవశాత్తు కిందపడ్డట్టు నమ్మించాడు.
చంద్రకళ భర్తను కిడ్నాప్ చేసి.. అతను నిధి కోసం వెళ్లినట్టు.. ఆ ప్రయత్నంలో చనిపోయినట్టు వార్తను సృష్టించాడు.
ఈ భయంతో ఎవ్వరికీ చెప్పకుండా చంద్రకళ కుటుంబం ఇక్కడికి వచ్చింది.
ఆమెలో భయాన్ని పెంచడానికి ఆ కుటుంబం పిచ్చిదని నమ్మించడానికి పావులు కదిపాడు. అతనికి నేను సహకరించాను. చంద్రప్రభ మీద అత్యాచారం చేయమని చెప్పింది అతనే.. నాకున్న వీక్నెస్ వల్ల నేనూ ఒప్పుకున్నాను. తరువాత ఈ డాక్టర్‌ని అయిదు లక్షలకు కొని చంద్రప్రభ పిచ్చిదని సర్ట్ఫికెట్ ఇప్పించాడు...’ ఆగాడు దుర్జన్‌కుమార్.
* * *
‘కేవలం డబ్బు కోసం.. కొన్ని నిమిషాల సెక్స్ సుఖం కోసం ఒక కుటుంబాన్ని నాశభం చేయడానికి సిద్ధపడ్డావు.. నీకూ ఒక కుటుంబం ఉందన్న విషయం మర్చిపోయావు’ కోపంగా అన్నాడు సమీర్.
దుర్జన్‌కుమార్ తల దించుకున్నాడు. పశ్చాత్తాపముతో కాదు.. భయంతో.
‘మరి చంద్రకళ భర్త.. రాజేంద్రనాథ్‌ను ఏం చేశారు?’
‘అతని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు.. శివప్రసాద్ వర్మ చెప్పినట్టు చేయకపోతే ఎక్కడ తన కుటుంబాన్ని చంపేస్తారేమో అనే భయంతో అతను చెప్పినట్టు చేస్తూ వచ్చాడు.. ఒక ఆత్మలా నటిస్తూ భార్యను నమ్మించాడు. చంద్రలేఖ తెలివైన అమ్మాయి కాబట్టి ఆమెకు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. చంద్రలేఖ పోలీసుస్టేషన్‌కు వచ్చినప్పుడు ఆమెను కూడా చంద్రప్రభలా రేప్ చేయమని చెప్పింది శివప్రసాద్ వర్మే.. ఆ తరువాత ఆమెను కూడా పిచ్చిదానిలా మార్చాలని ప్రయత్నం.. అయితే చంద్రలేఖ నా విషయంలో స్మాట్‌గా ప్రవర్తించింది.. నన్ను చంపడానికే డార్క్ అవెన్యూకు తీసుకు వెళ్లిందని తరువాత తెలిసింది..’
‘మరి ఆత్మలు అర్ధరాత్రి శబ్దాలు.. ఇవ్వన్నీ ఏమిటి? అదీ మీ పనేనా?’ సమీర్ సూటిగా అడిగాడు.
‘కాదు అవి నిజమే. అది జంగానియాలోని మాంత్రికుడు తీశ్మార్ పని’
ఒక్కసారిగా అక్కడున్న అందరూ ఉలిక్కిపడ్డారు.
భార్గవి ఒళ్లు గగుర్పొడిచింది ఆ పేరు వినగానే...
* * *
ఒక్క క్షణం నమ్మశక్యం కాని నిజం ఒక శకలంలా సమీర్‌ని తాకింది.
‘నువ్వు నువ్వేమంటున్నావ్?’ రెట్టించి అడిగాడు దుర్జన్‌కుమార్‌ని.
‘నిజమే చెబుతున్నాను.. శివప్రసాద్ వర్మ జంఘానియాకు వెళ్లింది. అందుకే.. జంగానియాలో మాంత్రిక తెగ వుంది. తీశ్మార్ అనే తొంభై తొమ్మిదేళ్ల వృద్ధ మాంత్రికుడు శివప్రసాద్ వర్మకు మాటిచ్చాడు. ఆ నిధిని శివప్రసాద్ వర్మకు వచ్చేలా చేస్తానని...
‘ఈ కాలంలో కూడా ఇంత మూర్ఖంగా నమ్ముతున్నారా’ తనలో తనే గొణుక్కున్నాడు సమీర్.
‘సాబ్ మీరు ఏమనుకోనంటే ఒక్క మాట.. దేవుడు వున్న చోట సైతాన్ కూడా ఉంటుంది’ వహీద్ అన్నాడు.
భార్గవి అలాగే ఉండిపోయింది. ఏ జ్ఞాపకాలు తనను భయపెట్టాయో అవే జ్ఞాపకాలు తిరిగి ముందుకు వస్తున్నాయి.
‘అంటే డార్క్ అవెన్యూలో ఆత్మలు ఉండటం నిజమేనా?’ సమీర్ అడిగాడు.
‘నిజమే.. నేను చూశాను.. చంద్రప్రభను కలవడానికి వెళ్లినప్పుడు నీడలు కనిపించాయి.. అంతేకాదు ఒక్కోసారి ఆ ఇంట్లో వింతవింత శబ్దాలు కూడా వినిపిస్తాయి..’ దుర్జన్‌కుమార్ చెప్పాడు.
‘ఈ రోజు అర్ధరాత్రే చంద్రకళ కుటుంబాన్ని జంగానియాకు తీసుకు వెళ్తున్నాడు... ఈ పనిని రాజేంద్రనాథ్ ద్వారా చేయిస్తున్నాడు శివప్రసాద్ వర్మ’ చెప్పాడు దుర్జన్‌కుమార్.
‘ఇప్పుడు రాజేంద్రనాథ్ ఎక్కడున్నారు?’ సమీర్ అడిగాడు.
‘నాకు తెలియదు...’ అని భయంగా సమీర్ వైపుచూసి ‘నిజంగా నాకు తెలియదు..’ అన్నాడు.
‘శివప్రసాద్‌గారు ఇప్పుడు ఎక్కడున్నాడు?’
‘నిజంగా నాకు తెలియదు.. కానీ ఒక్కటి తెలుసు.. నేను తన రహస్యాలు బయటపెట్టిన మరుక్షణం చచ్చిపోతాను’ దుర్జన్‌కుమార్ కళ్లలో భయం కనిపించింది.
‘అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావ్? నువ్వున్నది మా కస్టడీలో’ సమీర్ అన్నాడు.
‘క్షుద్రశక్తిని ఏ కస్టడీ ఏమీ చేయలేదు. అయినా మీకు నిజం ఎందుకు చెప్పానంటే.. నేను నిజం చెప్పకపోతే మీరు చంపేస్తారు ఇప్పుడే...’
‘ఆ విషయం నాకు తెలుసు.. నిజం చెబితే ఆ శివప్రసాద్ వర్మ చంపేస్తాడు. ఆయుధంతో కాదు చే.. త.. బ.. డి..తో’ ఒక్కో అక్షరాన్ని నొక్కి పలుకుతూ అన్నాడు... ఎందుకంటే నా గొంతు దగ్గర చిన్న గాటు పెట్టి రక్తాన్ని తీసుకున్నాడు శివప్రసాద్ వర్మ.. చనిపోయే ముందు ఆరో ఓవర్‌గా మారితే ఆ సానుభూతితో నా కుటుంబాన్ని ఆదుకుంటారని...
నేను గొంతు విప్పి నిజం చెప్పిన కొద్దిసేపటిలోనే చ.. చ్చి..పోతా’ చివరి అక్షరం పూర్తిగా గొంతులో నుంచి రాకముందే దుర్జన్ కుమార్ గొంతు దగ్గర ఎంతో గొంతు నులుముతున్నట్టు వాతలు తేలుతూ గొంతు బిగుసుకుంటుంది... కొద్ది క్షణాలలోనే రక్తం గొంతులో నుంచి వచ్చింది.. తల పక్కకు వాల్చేశాడు.
అంతా క్షణాల వ్యవధిలోనే..
సమీర్ షాక్‌లో నుంచి కోలుకోలేదు..
భార్గవి ఇంకా షాక్‌లోనే వుంది.
డిసిపి అవినాష్ అలానే చూస్తూ ఉండిపోయాడు.. అతనికి ఇలాంటి అనుభవం మొదటిసారి.
చెడుతో సహవాసం చేసి చివరికి ఘోరమైన మరణానికి గురయ్యాడు దుర్జన్‌కుమార్.
భార్గవిని గమనించి ధైర్యం చెబుతూ ‘బహుశా దుర్జన్‌కుమార్‌ని మనం కస్టడీలోకి తీసుకుంటామని తెలిసి ముందే దుర్జన్ కుమార్‌కు పాయిజన్ ఇచ్చి ఉంటాడు శివప్రసాద్ వర్మ’
భార్గవి కన్విన్స్ కాలేక పోతుంది.. ఎందుకంటే జంగానియా.. గురించి తీశ్మార్ గురించ.. క్షుద్రశక్తుల ప్రభావం గురించి.. అనుభవపూర్వకంగా తెలుసుకున్న వ్యక్తి భార్గవి...
* * *
డార్క్ అవెన్యూ
చీకటి తెరల్లో మరింత భయంకరంగా కనిపిస్తోంది. చంద్రకళ కళ్లు భయంగా ఆ గది గోడలను పరిశీలిస్తున్నాయి. అప్పుడప్పుడు ఆమె చేతులు గుండెల మీదికి వెళ్తున్నాయి. చిన్న వైబ్రేషన్.. వెంటనే ఆ గదిలో వున్న అటాచ్డ్ బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. తలుపు వేసుకుంది. బ్లౌజ్‌లో నుంచి చిన్న పాతకాలం నాటి మొబైల్ ఫోన్ తీసింది.
మెల్లిగా ‘హలో’ అంది.
‘నేను చంద్రా.. నేను మనింటికి రావడానికి కొన్ని శక్తులు అడ్డు పడుతున్నాయి.. నువ్వు మన పిల్లలను తీసుకుని వెంటనే వచ్చేయ్.. మనం మన శరీరాలకు విముక్తి కలిగించే చోటుకు వెళ్తున్నాం.. నేను నీకు చేసే ఆఖరి ఫోన్ కాల్.. నువ్వు స్టేషన్ దగ్గరికి వచ్చేయ్.. అక్కడ మీ కోసం ఒక కారు సిద్ధంగా ఉంటుంది. అందులో వచ్చేయండి.. ఈ ఫోన్‌ను బాత్‌రూమ్‌లో వున్న కమోడ్‌లో వేసి ఫ్లష్ నొక్కేయ్.. మీరు త్వరగా రావాలి.. ఆలస్యమైతే నా ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది.. మనం ఇక కలుసుకోలేము’ అటువైపు నుంచి భర్త గొంతు.
రెండు రోజుల క్రితం ఆ ఫోన్ ఇచ్చాడు. సైలెంట్ మోడ్‌లో వున్న ఫోన్ ఎప్పుడు వైబ్రేట్ అయినా బాత్‌రూమ్‌లోకి వచ్చి మాట్లాడాలని చెప్పాడు.
ఆ రోజు భర్త చెప్పిన మాటలు బాగా గుర్తున్నాయి.
ఆమెలో ఆలోచన ఎప్పుడో అంతరించిపోయింది.
ఒక భయం మనల్ని ఎప్పుడు వచ్చి చేరుతున్నదో.. అప్పుడే బలహీనత భయంగా మారుతుంది. ఆలోచన అనాలోచితం అవుతుంది.
పూనకం మాస్ హిస్టీరియా ఇలాంటివే...
* * *
అదే సమయంలో వహీద్ తన బైక్‌ను డార్క్ అవెన్యూ ముందు ఆపాడు. అతని మనసులో ఆందోళన... భయం..
దానిక్కారణం అతనిలోని మానవత్వం.. మనిషిని ఆపద నుంచి కాపాడాలనుకునే స్వచ్ఛమైన మనిషిలోని మంచి తత్త్వం. ఆ క్షణం అతనికి భయం వేయలేదు. అతని కళ్ల ముందు చంద్రలేఖ కుటుంబం కనిపిస్తుంది. ఆ కుటుంబాన్ని కాపాడాలి. అందుకే ఎప్పుడైతే దుర్జన్‌కుమార్ తీశ్మార్ గురించి చెప్పాడో...

ఎప్పుడైతే దుర్జన్‌కుమార్ చనిపోయాడో అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు.
తను ఏం చేయగలడు.. తను చేయగలిగింది ఒక్కటే...
డార్క్ అవెన్యూ తలుపు తట్టాడు. ఆ సమయంలో చంద్రప్రభ ఓ మూలకు భయంతో ఒదిగి పడుకుని వుంది.. చంద్రకళ బాత్‌రూమ్‌లో వుంది.
చంద్రలేఖ చిన్నపాటి అనుమానంతో తలుపు సగం తెరిచింది. వహీద్ కనిపించాడు. వెంటనే వెనక్కి తిరిగి చూసి బయటకు వచ్చి తలుపు వేసి ‘్భయ్యా.. నువ్వా.. ఇంత రాత్రివేళ?’ వహీద్ మీద మంచి అభిప్రాయం ఉంది. ఆ రోజు దుర్జన్‌కుమార్ నుంచి ఒక విధంగా తనను రక్షించాడు.
‘సమయం లేదు బహెన్‌జీ.. మీ నాన్న బ్రతికే వున్నాడు.. సంతోషమైన వార్తే కానీ మీ కుటుంబం ప్రమాదంలో వుంది. అదేమిటో ఇప్పుడు వివరంగా చెప్పలేను.. ఈ భయ్యా మీద నమ్మకం వుంటే..’ అంటూ తన చేతికి వున్న తాయెత్తు తీసి చంద్రలేఖ చేతికి ఇస్తూ ‘దీన్ని కట్టుకో... ఎటువంటి పరిస్థితిలోనూ దీన్ని తీయవద్దు’ చెప్పాడు.
‘కానీ భయ్యా...’ ఏదో అనబోయింది చంద్రలేఖ.
‘బహెన్‌జీ రాఖీ పండక్కి సోదరుడికి రాఖీ కడుతుంది. చెల్లెలు.. సోదరుడు బావుండాలని.. ఈ భాయ్ ఈ సోదరి కుటుంబం బావుండాలని కడుతున్నాడు అనుకో.. తప్పుంటే మాఫ్ కీజియే’ అన్నాడు.
చప్పున వహీద్ చేతిని తీసుకుని కళ్లకు అడ్డుకుని ‘నువ్వు దేవుడు ఇచ్చిన అన్నయ్యవు’ అంది మనస్ఫూర్తిగా ఆ తాయెత్తు తీసుకుంటూ...
‘్థంక్యూ.. నేను వెళ్తాను.. ఈ తాయెత్తు విషయం ఎవ్వరికీ చెప్పకు. మిమ్మల్ని కాపాడడానికి సమీర్ సర్ భార్గవి మేడం వస్తున్నారు’ అంటూ మారు మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు.
దానికి కారణం ఉంది.
తనెప్పుడైతే చంద్రలేఖకు తాయెత్తు ఇవ్వాలనుకున్నాడో అప్పటి నుంచి తనను ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించింది. అందుకే అల్లాను ప్రార్థించి చంద్రలేఖకు తాయెత్తు ఇచ్చి సరాసరి దర్గాకు బయల్దేరాడు.
* * *
సమీర్ భార్గవి ఇద్దరూ పోలీసుస్టేషన్ బయట నిలబడి వున్నారు. అంబులెన్స్ వచ్చింది. దుర్జన్‌కుమార్‌ను పోస్టుమార్టం కోసం తీసుకువెళ్లారు. పోస్టుమార్టంలో ఏం తెలుస్తుంది? కొన్ని విషయాలు సైన్స్‌కు లాజిక్కు అందకపోవచ్చు. సమీర్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. తాను ఎన్నో కేసులు డీల్ చేశాడు. అవి నేరాలకు సంబంధించినవి. ఇవి అతీత శక్తులకు సంబంధించినవి. నమ్మశక్యం కాని విషయాలు.. ఎక్కడో వున్న వ్యక్తిని హిప్నాటిజం ద్వారా తనకు తానుగా ఆత్మహత్య చేసుకునేలా చేయవచ్చు.. ఎదుటి వ్యక్తి బలహీనుడైతే ట్రాన్స్‌లోకి వెళ్లిపోయే అవకాశం వుంది.
ఒక్క క్షణం తల విదిల్చాడు. ఇప్పుడు ఆలోచించవలసింది ఈ విషయం కాదు...
‘ఇప్పుడు... ఇప్పుడు ఏం చేద్దాం?’ అడిగింది భార్గవి.
‘దుర్జన్‌కుమార్ ఫోన్‌ను ట్రాప్ చేస్తే విషయం తెలుస్తుంది. మా డిపార్ట్‌మెంట్ అదే పనిలో వుంది. సిగ్నల్స్ ఆధారంగా శివప్రసాద్ వర్మ ఎక్కడున్నాడో ట్రేస్ చేయవచ్చు.. కాకపోతే ఒక్కోసారి నేరస్థులలు అనేకన్నా స్మార్ట్‌గా ఆలోచిస్తారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరాలు పెరుగుతున్నాయి. నేరాలను అదుపు చేసే టెక్నాలజీ నేరాలు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది’ చెప్పాడు సమీర్.
సరిగ్గా అప్పుడే ఫోన్ వచ్చింది. మొబైల్ తీసి మాట్లాడాడు.
‘అలాగే ఓకే ఓకే.. థాంక్యూ’ అన్నాడు ఫోన్ కట్ చేస్తూ.
‘శివప్రసాద్ వర్మ ఎక్కడ ఉన్నాడో తెలిసిందా?’ అడిగింది భార్గవి.
‘తెలిసింది ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం’ చెప్పి పోలీసుస్టేషన్ ముందు వున్న కారులో కూర్చున్నాడు. ఆ కారు డిసిపి అవినాష్ అరేంజ్ చేశాడు.
డ్రైవర్‌కు అడ్రస్ చెప్పాడు. కారు ముందుకు కదిలింది.
* * *
వహీద్ వెళ్లగానే అటుఇటు చూసి లోపలికి వెళ్లింది. చంద్రప్రభ తనను గమనించలేదు.. తల్లి ఆపుడే తన గదిలో నుంచి ఆదరాబాదరా బయటకు వచ్చింది. వస్తూనే చంద్రలేఖతో అంది. ‘మనము వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. మనం నాన్న దగ్గరికి వెళ్లిపోదాం..’ అంది.
చంద్రలేఖ ఉలిక్కిపాటుతో ‘ఎక్కడికి?’ అంది.
‘తెలియదు. నాన్న స్టేషన్ దగ్గరికి రమ్మన్నాడు. అక్కడికి ఒక కారు వస్తుంది. కారులో మనం ఒక దగ్గరికి వెళ్లాలి..’ అంది.
చంద్రలేఖకు అంతా అయోమయంగా వుంది.
‘మనం వెంటనే వెళ్లాలి... పద’ అంది తొందరచేస్తూ.
‘అది కాదు ముందు నువ్వు స్థిమితపడు’ చెప్పింది చంద్రలేఖ.. అసలు తల్లికి ఈ విషయం ఎవరు చెప్పారో అర్థం కాలేదు..
‘నీకు ఈ విషయం ఎవరు చెప్పారు?’ అడిగింది తల్లి వైపు చూసి.
‘మీ నాన్న ఫోన్‌లో చెప్పారు’ అంది తల్లి.
‘్ఫన్..? నీకు ఎక్కడిది?’ అనుమానంగా అడిగింది చంద్రలేఖ.
‘నాన్న మొన్న ఇచ్చారు’
‘ఏదీ ఆ ఫోన్ ఒకసారి ఇవ్వు’ అంది చంద్రలేఖ.
‘కమోడ్‌లో వేసి ఫ్లష్ నొక్కా’ అంది.
చంద్రలేఖకు పిచ్చెక్కిపోతోంది.
‘ముందు వెళ్దాం పద.. ఆలస్యమైతే నాన్న ఆత్మ మనకు కనిపించదు’ చెప్పింది తల్లి.
చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికి వస్తాడని శవాన్ని దాచిన వార్తలు గుర్తొచ్చాయి చంద్రలేఖకు.
నమ్మకం.. మూఢనమ్మకం.. వీటి మధ్య తేడాను విశే్లషించే ప్రయత్నం చేస్తుంది.
‘నువ్వొస్తావా? నేనూ అక్కయ్య వెళ్లిపోవాలా?’ అడిగింది తల్లి.
చంద్రలేఖకు ఆలోచించుకునే వ్యవధి లేదు.
కట్టుబట్టలతో బయల్దేరింది. వెళ్లే ముందు స్మార్ట్ ఫోన్‌లో జిపిఎస్ లొకేషన్ రూట్ మ్యాప్ ఆన్ చేసింది.. సమీర్‌కు షేర్ చేసింది...
సరిగ్గా అరగంటలో స్టేషన్ దగ్గరికి ఒక నలుపురంగు అంబాసిడర్ కారు వచ్చింది. అందులో డ్రైవర్ తప్ప మరెవరూ లేరు.. డ్రైవర్ ఫోన్‌ను చంద్రకళకు ఇచ్చాడు.. ఫోన్‌లో భర్త గొంతు వినిపిస్తోంది.
అతను ఏం చెబుతున్నది అర్థం కావడం లేదు చంద్రలేఖకు. తల్లి ‘అలాగే అలాగే’ అన్నది వినిపిస్తోంది.
చంద్రప్రభ పిచ్చి చూపులు చూస్తోంది.. దిక్కులు చూస్తోంది.
డ్రైవర్ చంద్రకళ చేతిలో వున్న ఫోన్ లాక్కున్నాడు.
ముగ్గురూ కారులో కూచోగానే కారు కదిలింది.
అన్నింటికీ సిద్ధపడే వచ్చింది చంద్రలేఖ.
ఆమెకు సమీర్ మీద నమ్మకం ఉంది.
(ఇంకా ఉంది)

తేజారాణి తిరునగరి