క్రీడాభూమి

టూర్ మ్యాచ్‌లో వెస్టిండీస్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, డిసెంబర్ 5: క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఎలెవెన్‌తో జరిగిన నాలుగు రోజుల టూర్ మ్యాచ్‌లో వెస్టిండీస్ పది వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. రెండు ఇన్నింగ్స్‌లో కేవలం పది పరుగుల విజయ లక్ష్యాన్ని సిఎ ఎలెవెన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 90.5 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. డారెన్ బ్రేవో (51), కార్లొస్ బ్రాత్‌వెయిట్ (47) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేదు. సిఎ ఎలెవెన్ బౌలర్ మిలెన్కొ సిమోన్ 76 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ బాజ్లే, కానెరూన్ బాయిస్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన సిఎ ఎలెవెన్ 104.2 ఓవర్లలో 444 పరుగుల భారీ స్కోరు సాధించింది. జాక్ కార్డర్ 58, నిక్ స్టీవెన్స్ 46, జొష్ ఇగ్లిస్ 44, కెప్టెన్, వికెట్‌కీపర్ జిమీ పీర్సన్ 64, మాథ్యూ షార్ట్ 76, జేమ్స్ బాజ్లే 50 చొప్పున పరుగులు చేశారు. విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ 76 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చాడు.
కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులు వెనుకంజలో నిలిచిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 58.2 ఓవర్లలో 210 పరుగులు చేసి, అతి కష్టం మీద ఇన్నింగ్స్ పరాజయం నుంచి బయటపడింది. అయితే, ప్రత్యర్థి ముందు కేవలం పది పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. కెప్టెన్ హోల్డర్ (65)ను మినహాయిస్తే మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోవడంతో విండీస్‌కు పతనం తప్పలేదు. సిఎ ఎలెవెన్ బౌలర్లలో ర్యాన్ లీస్ 68 పరుగులకు 3 వికెట్లు పడగొట్టగా జేమ్స్ బాజ్లేకు రెండు వికెట్లు లభించాయి. ఆతర్వాత సిఎ ఎలెవెన్ తరఫున ఓపెనర్లుగా వచ్చిన జేమ్స్ కార్డర్ (7), టిమ్ పైన్ (6) అజేయంగా 13 పరుగులు జోడించి, తిరుగులేని విజయాన్ని అందించారు.