పశ్చిమగోదావరి

గుండెపోటుతో ఎంపిడిఒ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామవరపుకోట, ఆగస్టు 18 : మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె శాంతారామ్ (57) గుండెపోటుతో హఠాన్మరణం చెందినట్లు మండల పరిషత్ అధ్యక్షురాలు మద్దిపోటి సుబ్బలక్ష్మి చెప్పారు. గురువారం ఉదయం ఏలూరులోని ఆయన స్వగృహం నుండి కామవరపుకోట బయలుదేరుతుండగా ఛాతీలో నొప్పి అంటూ కుప్పకూలిపోయారని, వెనువెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే లోపే మృతిచెందారన్నారు. శాంతారామ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారని, అక్టోబర్‌లో కృష్ణాజిల్లాలో సూపరింటెండెంట్ నుంచి పదోన్నతిపై కామవరపుకోట ఎంపిడివోగా బాధ్యతలు స్వీకరించారన్నారు. శాంతారామ్ స్వగృహం పాలకొల్లులోని దిగమర్రు కావడంతో ఆయన మృతదేహాన్ని అక్కడకు తరలించారు. కామవరపుకోట జడ్పీటిసి ఘంటా సుధీర్‌బాబు, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి మద్దిపోటి నాగేశ్వరరావు, ఎంఇవో కె ప్రభాకరరావు, వివిధ శాఖల అధికారులు ఎంపిడివో భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.