పశ్చిమగోదావరి

భీమవరం పట్టణానికి ‘అమృత’మే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఆగస్టు 18: జిల్లాలోని సుదీర్ఘ చరిత్ర కలిగిన భీమవరం పట్టణానికి భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన అమృత్ పథకంలో చోటు లభించింది. ఈ పథకం కింద ఎంపికైన చాలా పట్టణాలు ఇంకా అవసరమైన ప్రణాళికల రూపకల్పనలో ప్రాథమిక దశలోనే ఉన్నాయి. డిపిఆర్ స్థాయిలో భీమవరం పురపాలక సంఘం ముందు నిలిచి పరిపాలనా అనుమతి కూడా పొందింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాల్టీ సంయుక్తంగా ఈ పథకంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి. మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు ఆధ్వర్యంలో అవసరమైన డిపిఆర్‌లను సిద్ధంచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించడంతో పరిపాలనా అనుమతి లభించింది. రూ.47.29 కోట్లతో మంచినీటి పథకాల పనులను చేసుకునేందుకు కూడా అనుమతినిచ్చింది. ఈ పథకంలో భాగంగా భీమవరం పురపాలక సంఘంలోని గత 50 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన పాత పైపులైన్లను తొలగించి 126 కిలోమీటర్ల మేర కొత్త పైపులైన్లను రూ.19.5 కోట్లతో ఏర్పాటుచేయనున్నారు. ఐదున్నర కిలోమీటర్ల పొడవుకలిగిన పాత పంపింగ్ మెయిన్ స్థానంలో రూ.8.5 కోట్లతో కొత్త పంపింగ్ మెయిన్‌ను మార్చనున్నారు. అంటే హెడ్ వాటర్ వర్క్స్ నుంచి బుధవారం మార్కెట్టు వరకు ఈ కొత్త పంపింగ్ మెయిన్‌ను ఏర్పాటుచేస్తారు. అలాగే ఈ ప్రాంతంలో రూ.7 కోట్లతో సుమారు 20వేల మంచినీటి కుళాయిలను తొలగిస్తారు. ఇవన్నీ కూడా నాటి కాలంలో ఏర్పాటుచేసినవే. వాటిని తొలగించి కొత్త కుళాయి కనెక్షన్లు వేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ డాక్యుమెంట్ ఆమోదించింది. టెండర్ ప్రక్రియను ప్రారంభించి సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తిచేసి, కాంట్రాక్టరును ఖరారు చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు తెలిపారు.