పశ్చిమగోదావరి

విషాదం నింపిన బస్సు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు, ఆగస్టు 22: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నాయక్‌గూడెం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం జిల్లాలో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు కాలువలో బోల్తాపడిన దుర్ఘటనలో తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన కొప్పాడ జ్ఞాన సుమంతసాయి (20), నిడమర్రు మండలం దేవరగోపవరం గ్రామానికి చెందిన వానపల్లి పెద్దిరాజు (32), ఉంగుటూరుకు చెందిన తొత్తల వెంకట త్రినాథ దుర్గారావు (25) మృతిచెందారు. వేల్పూరు గ్రామానికి చెందిన కొప్పాడ జ్ఞాన సుమంతసాయి (20) ఇంజనీరింగ్ పూర్తిచేసుకుని, ఉద్యోగ అనే్వషణలో భాగంగా హైదరాబాద్‌లోని మేనమామ వద్దకు వెళ్లి, తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. హైదరాబాద్‌లో బయలుదేరిన సాయి సోమవారం మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో వేల్పూరులోని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈలోగా ప్రమాద సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. హుటాహుటిన ఖమ్మం బయలుదేరివెళ్లారు. సాయికి తల్లి మణి, సోదరి తేజ ఉన్నారు. తండ్రి గతంలోనే మృతిచెందారు. చేతికి అందివస్తాడనుకున్న కొడుకు మృత్యువాతపడటంతో ఆ తల్లి ఆవేదనకు అంతులేకుండా పోయింది.
నిడమర్రు: నిడమర్రు మండలం దేవర గోపవరం గ్రామానికి చెందిన వానపల్లి పెద్దిరాజు (32) బస్సు ప్రమాదంలో మృతిచెందినట్టు బంధువులు సోమవారం విలేఖరులకు తెలిపారు. హైదరాబాదులో పెళ్లికి వెళ్లిన పెద్దిరాజు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వస్తుండగా జరిగిన ప్రమాదంలో పెద్దిరాజు మృతిచెందారు. తాపీమేస్ర్తీగా పనిచేసే పెద్దిరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెద్దిరాజు మృతికి ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, వైసీపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల శ్రీనివాసరావు, మానవత జిల్లా అధ్యక్షుడు జానకిరామయ్య, ఎంపిపి నిమ్మల మాణిక్యాలరావు, జడ్పీటీసీ విప్పర్తి దివాకర్, దేవరగోపవరం సర్పంచ్ కాకర్ల లక్ష్మి తదితరులు సంతాపం తెలిపారు. మృతదేహాన్ని సోమవారం రాత్రి 12 గంటల సమయానికి స్వగ్రామం చేరుస్తారని బంధువులు తెలిపారు. పెద్దిరాజు మృతితో నిడమర్రు మండలం దేవరగోపవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఉంగుటూరు: ఉంగుటూరుకు చెందిన తొత్తల వెంకట త్రినాధ దుర్గారావు (25) హైదరాబాద్ నుండి బస్సులో వస్తూ ఖమ్మం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఆటో నడుపుకునే దుర్గారావు ఉంగుటూరు వంతెన సెంటర్లోనే ఇల్లు ఉండడంతో బజార్లో ఉన్న వారందరితో స్నేహసంబంధాలు ఉండేవి. వీరంతా దుర్గారావు మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. సెంటర్లో ఉన్న దుకాణ యజమానులు దుర్గారావుతో ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకుని బాధపడ్డారు. భార్య లక్ష్మి, తల్లి కాంతమ్మ, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.