పశ్చిమగోదావరి

కార్పొరేటర్ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 22 : ఏలూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్ ఒకరు కడుపునొప్పి తాళలేక చీరను ఫ్యాన్‌కు తగిలించుకుని ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. స్థానిక 10వ డివిజన్ కార్పొరేటర్ పోలిశెట్టి తులసీరామ్ గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మందులు వాడుతున్నా గానీ తగ్గడం లేదు. దీనితో సోమవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో కడుపునొప్పి రావడంతో బాధభరించలేక చీరను మెడకు చుట్టుకుని ఫ్యాన్‌కు తగిలించుకుని ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నగర సి ఐ రాజశేఖర్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, కార్పొరేటర్ కప్పా ఉమామహేశ్వరరావు తదితరులు ఆసుపత్రికి వెళ్లి తులసీరామ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి వైద్యులతో సంప్రదించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.