పశ్చిమగోదావరి

యువతను సన్మార్గంలో నడిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 25: పెడద్రోవ పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత నేటితరంపై ఉందని కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖ మంత్రి వై సుజనాచౌదరి అన్నారు. స్ధానిక ఆగ్రహారంలోని వైఎహెచ్‌ఎం హాలు 111 వసంతాల వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా భారతీయ సంస్కృతి గురించి, కూచిపూడి నాట్యాలను కూడా ఆదరిస్తున్నారన్నారు. అన్నిదేశాల్లో కూడా భారతదేశ గొప్పతనం, ఔన్నత్యాన్ని ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో కూడా మన భారతీయులు విదేశాల్లో కూడా అద్భుత ప్రతిభ కనపర్చటం అభినందనీయమన్నారు. వారిలో ఎక్కువమంది మన తెలుగువారు ఉండటం గర్వకారణమన్నారు. హిందూ యువజన సంఘం లాంటి సంఘాలు యువతను ఉత్తేజపర్చాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాపట్ల ఎంపి మాల్యాద్రి శ్రీరామ్, విజయవాడ ఎంపి కేశినేని నాని, వైఎంహెచ్‌ఎ ప్రతినిధులు వేణుగోపాల్ లునాని, కెవి సత్యనారాయణ, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కళాకారులకు ప్రశంసాపత్రాలను మంత్రి అందజేశారు. అనంతరం మంత్రిని వైఎంహెచ్‌ఎ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ప్రదర్శించిన శ్రీ కృష్ణ రాయబారం నాటికను తిలకించి కళాకారులను మంత్రి సుజనాచౌదరి అభినందించారు. సినిమాకు ధీటుగా ఈ ప్రదర్శన ఉందని పేర్కొన్నారు.