పశ్చిమగోదావరి

అక్రమ కలప స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 25: కలప అక్రమంగా రవాణా చేస్తున్న మూడు వాహనాలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాల నుంచి లక్ష రూపాయల విలువైన కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన అటవీశాఖ ఫ్లైయింగ్ స్వ్కాడ్ డిఎఫ్‌ఓ ఎం గురుప్రభాకర్ ఇచ్చిన సమాచారం అధారంగా గురువారం తెల్లవారుఝామున ఏలూరు సమీపంలోని చింతలపూడి బైపాస్ రోడ్డులో అటవీశాఖ టాస్క్ఫోర్స్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎస్‌వికె కుమార్ ఆధ్వర్యంలో వలపన్ని ఈ వాహనాలను పట్టుకున్నారు. ఎర్రచందనం మాదిరిగా ఉండే నారావేసి కలప దిమ్మలను ఈ మూడు వాహనాల్లో తరలిస్తున్నట్లు గుర్తించారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం ఆసుపాక నుంచి తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి ఈ అక్రమ కలప తరలిస్తున్నట్లు గుర్తించారు. 15లక్షల రూపాయల విలువైన ఈవాహనాలను సీజ్ చేసి వాటిలో ఉన్న లక్ష రూపాయల విలువైన కలపదుంగలను అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల డ్రైవర్లు ఇద్దరు పరారు కాగా మరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను, డ్రైవర్‌ను అటవీశాఖాధికారులకు అప్పగించినట్లు కుమార్ తెలిపారు.
ప్రక్కిలంకలో...
తాళ్లపూడి: పోలవరం ఫారెస్టు రేంజర్ డేవిడ్‌రాజు ఆదేశాల మేరకు మండలంలోని ప్రక్కిలంకలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సిహెచ్ సుజాత సిబ్బందితో జరిపిన తనిఖీల్లో రూ.80 వేల విలువైన కలప లభ్యమైంది. సిందుగ, కొండ తంగేడు, రోజ్‌వుడ్ తదితర దుంగలను గుర్తించామన్నారు. పాఠశాల సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఈ కలపను అధికారులు స్వాధీనంచేసుకున్నారు. ఎవరూ రాకపోవడంతో కలపను ట్రాక్టరుపై పోలవరం రేంజ్ ఆఫీస్‌కి తరలించారు. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని సుజాత తెలిపారు.