పశ్చిమగోదావరి

సాధ్యమైనంత త్వరగా ‘నిట్’కు శాశ్వత భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఆగస్టు 25: నిట్ శాశ్వత భవనాల నిర్మాణం సాధ్యమైనంత త్వరితగతిన పూర్తయ్యేలా కృషిచేస్తున్నామని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిగూడెం వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో నిట్ తాత్కాలిక తరగతుల నిర్వహణ విద్యార్థుల సౌకర్యాలు పరిశీలించారు. శాశ్వత భవనాలకు అవసరమైన నిధులు, మాస్టర్ ప్లాన్ రూపకల్పన, సమగ్ర ప్రాజెక్టు నివేదికపై అధికారులతో సమావేశమై చర్చించారు. కళాశాల పాలకవర్గాన్ని అభినందించారు. హాస్టల్ భవనాల నిర్మాణం అక్టోబర్, నవంబరు నెలల్లో ప్రారంభించి జూన్, జూలై నాటికి పూర్తిచేసేందుకు కృషిచేయాలన్నారు. భవన నిర్మాణాల్లో జాప్యం లేకుండా టెండర్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలన్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం వెంట నిట్ మెంటర్ డైరెక్టర్ డాక్టర్ చలం, ప్రెసిడెంట్, కో- ఆర్డినేటర్ డాక్టర్ టి.రమేష్, ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ కె.మధుమూర్తి, సీపీ డబ్ల్యూడీ అధికారి సి. ఎన్.సురేష్, వాసవి కళాశాల కార్యదర్శి చలంచర్ల సుబ్బారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.బ్రహ్మయ్య, ఏవో నారాయణరావు తదితరులున్నారు.