పశ్చిమగోదావరి

పట్టిసం కంటే రెట్టింపు వేగంతో పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఆగస్టు 25: పట్టిసం ఎత్తిపోతల పథకం నిర్మించిన స్ఫూర్తితో రెట్టింపు వేగంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తిచేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మంత్రి దేవినేని వివరించారు. ఉదయం జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన అనంతరం పనుల వివరాలను ఎస్‌ఇ రమేష్‌బాబు, ట్రాన్స్‌ట్రాయ్ ఎండి చెరుకూరి శ్రీ్ధర్‌తో కలిసి మంత్రి నిర్మాణం జరుగుతున్న విధానాన్ని, వివరాలను తెలియజేశారు. విజయవాడలో ఉన్న సిఎం చంద్రబాబు లైవ్ ద్వారా పనులను చూస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మ్యాప్ ద్వారా ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాంకు సంబంధించిన నిర్మాణ పనులను వివరించారు. ఆ తర్వాత క్యాంపు కార్యాలయంలో పవర్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి ఎస్‌ఇ రమేష్‌బాబు ఇప్పటి వరకూ జరిగిన పనుల తీరును వివరించారు. అధికారులు, కాంట్రాక్ట్ ఏజన్సీ సిబ్బందితో మాట్లాడుతూ స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో మట్టి పనులను నూరు శాతం త్వరితగతిన పూర్తిచేసే బాధ్యత మీదేనని మంత్రి దేవినేని అన్నారు. ప్రతి వారం సిఎం లైవ్ ద్వారా పనులు పరిశీలించి సమీక్షిస్తారని, నెలకోమారు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శిస్తారని చెప్పారు. రాష్ట్రం లోటు బడ్జెట్టులో ఉన్నా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలనే సంకల్పంతో సిఎం ఉన్నారన్నారు. ఇప్పటి వరకూ రూ.1804 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిందని, ఆ నిధులను రాష్ట్రానికి కేంద్రం చెల్లించాల్సి ఉందన్నారు. పట్టిసం ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందుతోందన్నారు. శ్రీశైలం నుండి హంద్రీనీవా, గాలేరు ద్వారా రాయలసీమకు సాగునీరు అందిస్తామన్నారు. మంత్రి దేవినేని వెంట పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, జెసి పి కోటేశ్వరరావు, ఆర్డీవో ఎస్ లవన్న, ప్రాజెక్టు ఇఇ పుల్లారావు, సిఐ కె బాలరాజు, పలువురు ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు.