పశ్చిమగోదావరి

ఉమ్మడి పోరాటానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 29 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు దీనికోసమే కష్టపడుతున్నారని టిడిపి రాష్ట్ర నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. హోదా విషయంలో ఎవరు కలిసి వచ్చినా వారితో కలిసి పోరాడేందుకు తామంతా సిద్ధంగా వున్నామని చెప్పారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ హోదాకోసం పోరాడతానని ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు. స్థానిక జిల్లా టిడిపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా, అన్యాయంగా విభజించిందని ధ్వజమెత్తారు. ఆస్తులు, అప్పుల పంపకాల్లోనూ అసంబద్ధమైన తీరును అవలంభించిందని, ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం కష్టాల్లో కూరుకుపోయి వుందని చెప్పారు. కనీసం రాజధాని కూడా లేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించి అభివృద్ధి పథంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ప్రత్యేక హోదా అవసరం ఎంతో వుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు ప్రత్యేక ప్యాకేజీ, విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేయడం వంటివి అత్యవసరమని పేర్కొన్నారు. వీటి కోసం తాము నిరంతరంగా పోరాడతామని చెప్పారు. అయితే గత ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేశామని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో వున్నందున ప్రత్యక్ష పోరాటాల కన్నా ఆశించిన స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి హక్కులను కాపాడుకునే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు 25సార్లు ఢిల్లీ వెళ్లి అన్ని స్థాయిల్లో మంత్రులను కలుసుకుని రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితిని వివరిస్తూ వచ్చారని, త్వరలోనే దీనికి ఒక పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వుందన్నారు. కాగా ప్రతిపక్ష పార్టీలు టిడిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయని, అలా కాకుండా నిర్మాణాత్మకంగా రాష్ట్రానికి సాధించాల్సిన హక్కుల విషయంలో కలిసి వస్తే ఎంతో మంచిదని చెప్పారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో జరిగిన సభలో టిడిపి చేస్తున్న ప్రయత్నాన్ని గుర్తించారని, అదే విధంగా ఆయన హోదా కోసం చేసే పోరాటాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే వైకాపా నేతలకు ఈ పరిస్థితి మింగుడు పడటం లేదని ఆ పార్టీ నేత విజయ సాయి రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ బిజెపిని తప్ప టిడిపిని, చంద్రబాబును విమర్శించకపోవడాన్ని తప్పుపట్టడం విడ్డూరంగా వుందన్నారు. ఇక ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి సంబంధించి లక్ష కోట్ల రూపాయల ఆరోపణలు రావడం తెలిసిందేనని, దీనిలో 42 వేల కోట్లకు సంబంధించి సిబి ఐ ఇప్పటికే కేసులు వేసిందని చెప్పారు. ఈ కేసు తేలిన తరువాత ఆ విధంగా అక్రమంగా తేలిన 42 వేల కోట్ల రూపాయల ఆస్తులు కేంద్రానికి దఖలు పడతాయని, అలా కాకుండా ఈ ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవై నందున రాష్ట్రానికి అప్పజెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేత జగన్ నోటి వెంట ఒక్క మంచిమాట కూడా రావడం లేదని, మంచి పని జరిగినప్పుడు కనీసం స్వాగతించే పరిస్థితి కూడా ఉండటం లేదని విమర్శించారు. అంగరంగ వైభవంగా పుష్కరాలు జరిగినా దానిలోనూ ఎక్కడో ఒక చోట జరిగిన లోటుపాట్లను భుజాన వేసుకుని మొత్తం ప్రభుత్వాన్ని, పుష్కరాల వ్యవస్థను తప్పుపట్టే రీతిలో వ్యాఖ్యానాలు చేయడం దారుణమన్నారు. ఈ పరిస్థితి మారాలని కోరారు. కాగా రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంతో అవసరమని, ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా పూర్తి చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు కోసం వేచి వుండకుండా రాష్ట్ర బడ్జెట్‌లోనే నిధులు కేటాయించి మరీ ఈ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళుతున్నామని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు ఉప్పాల జగదీష్‌బాబు, పాలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.