పశ్చిమగోదావరి

అక్రమ లేఅవుట్లు, భవన నిర్మాణాలపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 2 : జిల్లాలో పంచాయతీల్లో జరిగే అక్రమ లే అవుట్లు, అక్రమ భవన నిర్మాణాలపై దృష్టి కేంద్రీకరించి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం పంచాయితీల్లో పన్నుల వసూళ్లు, ధృవీకరణ పత్రాల మంజూరు, బయోమెట్రిక్ హాజరు తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయితీల్లో అధికారుల నిర్లక్ష్యం, అవకతవకలవలన అక్రమ లే అవుట్లు, భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, త్వరలో పంచాయితీల్లో ఎక్కడెక్కడ అక్రమ లే అవుట్లు, బిల్డింగుల నిర్మాణం జరుగుతున్నదీ తెలుసుకునేందుకు ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నట్లు చెప్పారు. దీని ఆధారంగా అక్రమ లే అవుట్లు, భవనాల నిర్మాణానికి సహకరించే అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయితీల్లో ఎన్ని మోటార్లు, పంపుసెట్లు వున్నాయి, వాటి కెపాసిటీ, నెలనెల వాటికి వచ్చే కరెంటు బిల్లులు తదితర వివరాలను పంచాయితీల వారీగా తనకు అందజేయాలన్నారు. 15 సంవత్సరాలు దాటిన మోటార్లకు పంపుసెట్లు తొలగించి వాటి స్థానే సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీని వలన విద్యుత్ బిల్లులు సగానికి పైగా ఆదా అవుతాయని చెప్పారు. గత ఏడాది పన్నుల వసూళ్లపై సమీక్షిస్తూ దేవరపల్లి, వీరవాసరం మండలాల్లో మిగిలిన మండలాలకంటే తక్కువ పన్నుల వసూళ్లు జరుగుతున్నాయని, ఈ విషయంలో ఇవో ఆర్‌డిల నిర్లక్ష్యం తెలుస్తోందని, వీరిపై చార్జెస్ ఫ్రేమ్ చేయాలని డిపివో సుధాకర్‌ను ఆదేశించారు. చేపల చెరువుల లీజు సొమ్ము ఒకేసారి వసూలు చేయకుండా వాయిదాల పద్దతిలో దఫదఫాలుగా వసూలు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. ఇకపై చేపల చెరువుల వేలం రోజునే వారి నుంచి పోస్ట్ డేటెడ్ చెక్‌లు తీసుకోవాలని, వాటి ప్రకారం నిర్ణయించిన తేదీల్లో లీజు సొమ్ము తీసుకోవాలన్నారు. అన్ని పంచాయితీల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిపివో సుధాకర్, డి ఎల్‌పివో రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.