పశ్చిమగోదావరి

రేపు మీ కోసం రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 3: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ నెల 5వ తేదీన మీ-కోసం కార్యక్రమం ఉండదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. ప్రతి సోమవారం జరిగే మీ-కోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారని, అయితే సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో మీ-కోసం కార్యక్రమం నిర్వహించట్లేదని స్పష్టం చేశారు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ఆకివీడు, సెప్టెంబర్ 3: మండలంలోని సిద్దాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన గంగుల దుర్గాప్రసాద్ (23) మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇతన్ని చికిత్స నిమిత్తం భీమవరం తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఎస్సై కడియాల అశోక్‌కుమార్ కేసు నమోదు చేశారు.