పశ్చిమగోదావరి

బాంబు బూచాడు అరెస్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 6 : ఈస్ట్‌కోస్ట్ రైలులో బాంబు వుందంటూ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఏలూరు డివిజన్ పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఏలూరు డిఎస్‌పి జి వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా వున్నాయి. పెనుమంట్ర మండలం మల్లిపూడికి చెందిన వారణాసి రామ్మోహన్ ఇంతకుముందు తణుకు రైల్వేస్టేషన్‌లో అనౌన్స్‌మెంట్ విభాగంలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసేవాడు. అప్పట్లో స్టేషన్ మాస్టర్‌తో విభేదాలు రావడంతో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తరువాత పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఉద్యోగం నుంచి తొలగించారని రైల్వే శాఖపై, స్టేషన్ మాస్టర్‌పై రామ్మోహన్ కోపం పెంచుకున్నాడు. ఈ నేపధ్యంలో గత నెల 25న ఈస్ట్‌కోస్ట్ ట్రైన్‌లో బాంబు వుందంటూ విజయవాడ ఆర్‌పిఎఫ్‌కు ఫోన్ చేశాడు. దీనితో రైల్వే పోలీసులు అప్రమత్తమై ఏలూరులో ఈస్ట్‌కోస్ట్ రైలును నిలిపివేసి విస్తృతంగా తనిఖీలు చేశారు. అయితే బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకుని రైలును ముందుకు నడిపించారు. అయితే ఆర్‌పిఎఫ్‌కు చేసిన ఫోన్ కాల్ జిల్లా నుంచి వచ్చిందని తేలడంతో పోలీసు అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. విస్తృతంగా దర్యాప్తుచేసి చివరకు ఈ కేసులో వారణాసి రామ్మోహన్‌ను అరెస్టు చేశారు. విలేఖరుల సమావేశంలో ఏలూరు సిఐ బంగారురాజు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
పేలనున్న విస్తరణ బాంబు
ఎన్‌హెచ్ 165కు భారీ విస్తరణ - రహదారికి ఇరువైపులా 150 అడుగుల మేర భూ సేకరణ - అందరిలోనూ కలవరం

భీమవరం, సెప్టెంబర్ 6: జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 165)ని అభివృద్ధి పేరుతో భారీగా విస్తరించాలని తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్‌హెచ్ 165 పరిధిలోని 107.76 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయంచాయ. రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా ఎన్‌హెచ్ 165 అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. విస్తరణలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ఆర్‌ఓబిలు), కృష్ణా జిల్లాల్లో 5 ఆర్‌ఒబిలు నిర్మించనున్నారు. మొత్తం సుమారు రూ.1040 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. అయతే విచిత్రమేమిటంటే దేశంలోనే కాకుండా విదేశాల్లో భారతీయులు కూడా గర్వంగా చెప్పుకునే భీమవరం పట్టణ స్వరూపం ఈ విస్తరణతో పూర్తిగా మారిపోనుంది. పట్టణంలోని కీలకమైన మెయన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొత్తం భవనాలు, వాణిజ్య సముదాయాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భీమవరం నుండి దిగమర్రు వరకు పలు గ్రామాలు సైతం ఇదే ప్రమాదాన్ని ఎదుర్కోనున్నాయ. దీనితో ప్రజలందరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం భీమవరం పట్టణంలో ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ప్రజల ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించి, విస్తరణ వ్యవహారంపై నిరసన గళం వినిపించారు.
కేంద్రం మీద ఒత్తిడితెద్దాం
ప్రజల కోసం అభివృద్ధి చేయాలి గానీ, ఆ అభివృద్ధి ప్రజలకు చేదు అనుభవం మిగిల్చేలా ఉండకూడదు. భీమవరం పట్టణ స్వరూపాన్ని, వాణిజ్య సముదాయాలను కనుమరుగుచేసే ఈ ఆర్‌ఒబి, జాతీయ రహదారి అభివృద్ధి పనులు నిలుపుదల చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. బైపాస్ రోడ్డు, రైల్వేగేటు అంశాలపై గతంలో రైల్వేశాఖ మంత్రిని కలిసి అక్కడ రైల్వేగేటు ఏర్పాటుచేయాలని కోరాం. ఇప్పుడు కూడా భీమవరం పట్టణంలోని వ్యాపారులకు నష్టం కలిగించే ఏ అంశంపైనైనా తాను పోరాటానికి ముందుటానన్నారు. ఈ పోరాటంలో విజయం సాధిద్దామన్నారు.
-నరసాపురం ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు

నియోజకవర్గ ప్రతినిధిగా సిఎంను కలుస్తా
నియోజకవర్గంలోని ప్రధాన పట్టణంగా ఉన్న భీమవరానికి ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఆర్‌ఒబి వల్ల వ్యాపారులకు ఎంతో నష్టం కలగనుంది. 150 అడుగుల మేర భూమి సేకరణ చేయనున్నారు. అంటే సుమారు 10 ఎకరాల భూమి ఈ ఆర్‌ఒబికి అవసరమవుతుంది. 10 ఎకరాల భూమిలో పట్టణానికి, రాష్ట్రానికి, కేంద్రానికి కూడా ఎంతో నష్టం కలుగుతుంది. ఇక్కడే వ్యాపారులంతా ఏళ్ళ తరబడి వ్యాపారులు చేసుకుంటున్నారు. అకస్మాత్తుగా ఆర్‌ఒబి అంటే వారంతా రోడ్డున పడనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలుస్తా. నరసాపురం, పాలకొల్లు, ఆచంట, ఉండి తదితర ఎమ్మెల్యేలతో కలిసి సిఎంకు ఇక్కడ ప్రజలకు, వ్యాపారులకు జరిగే నష్టం గురించి వివరిస్తా.
-్భమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు

ఆర్‌ఒబి వద్దని కౌన్సిల్‌లో తీర్మానం చేస్తాం
స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపాల్టీకి కూడా తెలియకుండా సర్వేలు జరిగి టెండర్ల దశకు ఆర్‌ఒబి పనులు చేరుకున్నాయి. జాతీయ రహదారి అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం. కానీ పట్టణానికి నష్టం కలిగించేలా ఉన్న ప్రతీ అంశాన్ని కూడా కౌన్సిల్ వ్యతిరేకిస్తోంది. భీమవరం మున్సిపాల్టీని చీల్చుకుంటూ ఏర్పాటుచేసే ఈ ఆర్‌ఒబి, జాతీయ రహదారి అభివృద్ధి వద్దని కౌన్సిల్‌లో తీర్మానం చేస్తాం.
-మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా వెంకట సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారధి, భీమవరం బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గన్నాబత్తుల శ్రీనివాస్, బిజెపి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, విశ్వహిందూ పరిషత్ ప్రాంత కార్యాధ్యక్షులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు. మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు, చాంబర్ అధ్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణగుప్త అధ్యక్షతన మంగళవారం చాంబర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో ప్రముఖులు, వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు.

కొడుకులున్నారు జాగ్రత్త...!
-ఆస్తి కోసం తల్లిని ఇంటి నుండి తరిమేసిన తనయులు
-కాపాడమంటూ ఓ కన్నతల్లి ఆందోళన-
కొయ్యలగూడెం, సెప్టెంబర్ 6: ఆస్తులు పంచుకుని, ఇంకా ఉన్న ఆస్తి కోసం వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఇంటి నుండి తరిమేసిన తనయుల ఉదంతమిది. పున్నామ నరకం నుండి తప్పిస్తారనే పుత్రులు చివరకు బతికుండగానే ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. 75 ఏళ్ల వయస్సులో కన్న కొడుకుల బారినుంచి రక్షణ కల్పించాలంటూ ఆ వృద్ధురాలు గ్రామంలోని గాంధీ విగ్రహాన్ని ఆశ్రయంచింది. కొయ్యలగూడెం మండలంలోని కన్నాపురంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్నకొడుకుల బారి నుండి తనకు రక్షణ కల్పించాలని, తనను ఆదరించి, అన్నం పెట్టాలని గుబ్బా నాగరత్నం అనే వృద్ధురాలు వాపోతోంది. తనపేరిట ఉన్న ఆస్తిని రాసిచ్చెయ్యాలని, లేకుంటే చంపేస్తామంటూ కొడుకులు కొట్టిన దెబ్బలకు పళ్ళు సైతం ఊడిపోయాయని వాపోయంది. తనకు న్యాయం జరిగేవరకు ఇక్కడ నుండి కదిలేది లేదని గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతోంది. మంగళవారం ఉదయం నుండి ఆమె విగ్రహం వద్ద అలానే కూర్చుండిపోయింది. నలుగురు కొడుకులను, ఒక కుమార్తెను కని పెంచి పెద్ద చేసిన నాగరత్నం పట్టెడన్నం కోసం వీధిన పడాల్సి రావడం చూపరులను కలచివేసింది.
తన భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడని, కుమార్తెకు వివాహం చేయడంతో ఆమె నిడదవోలులో నివసిస్తోందని నాగరత్నం చెప్పింది. నలుగురు కుమారులకు కన్నాపురంలో నిర్మించిన ఎనిమిది షాపులు ఒక్కొక్కరికి రెండేసి ఇవ్వడంతో వారు వ్యాపారాలు చేసుకుంటున్నారని, వీరిలో ఇద్దరికి సొంత ఇళ్లు ఉన్నాయని చెప్పింది. తమకు ఉన్న నాలుగు ఎకరాల మాగాణి భూమి ఒక్కో ఎకరం చొప్పున పంచుకుని అనుభవిస్తున్నారని చెప్పింది. తన పేరిట ఒక పెంకుటిల్లు, మూడు ఎకరాల మెట్ట భూమి ఉందని, పెంకుటిల్లులోని ఒక వాటా అద్దెకు ఇచ్చుకుని, వచ్చిన జీవనం సాగిస్తున్నానని చెప్పింది. ఇప్పుడు ఆ పెంకుటిల్లు, మూడు ఎకరాల మెట్ట భూమి రాసిస్తేనే తనను చూస్తామంటున్నారని, లేవలేని స్థితిలో తనకు పట్టెడన్నం పెట్టడానికి నలుగురు కుమారులు, కోడళ్లు నిరాకరిస్తున్నారని వాపోయింది. అంతేగాకుండా ఆస్తి వారి పేరిట రాయించుకున్న పత్రాలు తీసుకువచ్చి సంతకాలు చేయాలని వేధిస్తున్నారని, సంతకాలు చేయనంటే కొడుతున్నారని వాపోయింది. ప్రభుత్వం సత్వరమే కల్పించుకుని వయో వృద్ధుల సంక్షేమ చట్టం ద్వారా ఆమెకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.