పశ్చిమగోదావరి

15 నుంచి రాష్టస్థ్రాయ పాడి పశువుల పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 6 : రాష్టస్థ్రాయి పాడి పశువుల పోటీలు ఈ నెల 15వ తేదీ నుంచి 17 వరకు ద్వారకాతిరుమలలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సిఇవో డాక్టర్ పిడి కొండలరావు తెలిపారు. స్థానిక పశుసంవర్ధక శాఖ జెడి కార్యాలయంలో మంగళవారం పోటీల నిర్వహణపై అధికారులతో ఆయన సమీక్షించారు. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి పాల పోటీలు, పశుజాతి అందాల పోటీలను రెండు విభాగాల్లో నిర్వహిస్తామన్నారు. పాలపోటీల్లో ముర్రాజాతి గేదెలు, ఒంగోలు జాతి ఆవులు, గిరి, పుంగనూరు, షాహివాన్ తదితర దేశవాణి జాతుల పాడిగేదెలను మాత్రమే అనుమతిస్తామన్నారు. పోటీలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తారని చెప్పారు. పోటీల్లో గెలుపొందిన ముర్రాజాతి గేదెలు, ఒంగోలు జాతి ఆవులకు మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండవ బహుమతిగా రూ.30 వేలు, 3వ బహుమతిగా రూ.20 వేలు అందిస్తామన్నారు. గిరి, పుంగనూరు తదితర జాతి గేదెల పాల పోటీల్లో గెలుపొందిన పాడి పశువులకు రూ.25, 20, 15 వేలు చొప్పున బహుమతులను అందజేస్తామన్నారు. పశుజాతి పోటీల్లో గెలుపొందిన పశువులకు 15వేలు, 10వేలు, 5వేల రూపాయలు చొప్పున మొదటి మూడు బహుమతులు అందజేస్తామని చెప్పారు. పోటీల్లో పాల్గొనే పశుపోషకులు సెప్టెంబర్ 15వ తేదీన ద్వారకాతిరుమల వ్యవసాయ మార్కెట్ కమిటీలో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు
ద్వారకాతిరుమల: గోవుల పాల అందాల పోటీల నిర్వహణలో పాల్గొనే రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పిడి కొండలరావు సూచించారు. ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకూ మూడు రోజులపాటు జాతి ఆవులకు పాల, అందాల పోటీలు జరిగే మార్కెట్టు యార్డును మంగళవారం సిఇఒ కొండలరావు పరిశీలించారు.