పశ్చిమగోదావరి

తూర్పుతాళ్ళు, పెదమైనవాని లంకలు ఆదర్శనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, మార్చి 27: మొదటిసారిగా నూరుశాతం సౌర విద్యుత్‌ను వినియోగించుకునే గ్రామాలుగా తూర్పుతాళ్ళు, పెదమైనవాని లంకలు నిలుస్తాయని, ఇవి దేశానికే ఆదర్శమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్రమంత్రి దత్తత తీసుకున్న తూర్పుతాళ్ళు, పదమైనవానిలంక గ్రామాలలో ఆమె ఆదివారం పర్యటించి, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాలలో నిర్వహించిన బహిరంగ సభల్లో మంత్రి మాట్లాడుతూ సౌర విద్యుత్‌ను గణనీయంగా వినియోగించాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా తాను దత్తత తీసుకున్న గ్రామాలలో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసామన్నారు. ఈ ప్లాంట్ల ద్వారా కాలుష్యం లేని విద్యుత్‌ను గ్రామస్థులకు సరఫరా చేయవచ్చన్నారు. అంతేకాకుండా రెండు గ్రామాల ప్రజలకు యూనిట్‌కు 60 పైసలు చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. దీనివలన రెండు పంచాయితీలకు ఏడాదికి రూ. 8 లక్షలు ఆదా అవుతుందన్నారు. అలాగే ఈ ప్రాంతాలలో ఉత్పత్తి అయ్యే ఉప్పుకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు వీలుగా ఉప్పు రైతులకు గుజరాత్ రాష్ట్రంలో శిక్షణ ఇస్తునట్టు మంత్రి తెలిపారు. మొదటి దశలో 30 మంది రైతులు శిక్షణ పొందారన్నారు. అంతేకాక ఇక్కడ గురుకుల పాఠశాల, రహదార్లు, ప్రభుత్వాసుపత్రి ఏర్పాటుకు త్వరలో నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే ప్రధాని ప్రారంభించిన మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా విదేశాల నుండి పెద్దఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నారు. పరిశ్రమల స్థాపనకు భరోసా ఇస్తూ సింగల్‌విండో ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ముందుగా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు, పెన్షన్లు మంత్రి పంపిణీ చేశారు. అనంతరం నల్లీక్రీక్ వంతెన పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. పనుల నత్తనడకపై ఆర్‌అండ్‌బి అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 31 నాటికి పనులు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. సర్పంచ్‌లు చామాకూరి సుబ్బలక్ష్మి, తిరుమాని నాగలక్ష్మి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎంపి గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, పీతాని సత్యనారాయణ, ఎంపిపి వాతాడి కనకరాజు, మున్సిపల్ చైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాల, ఎఎంసి ఛైర్మన్ రాయుడు శ్రీరాములు, సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్, టిడిపి నాయకులు అండ్రాజు చల్లారావు, కొండేటి రామకృష్ణారావు, కొప్పాడి రవి, కొల్లు పెద్దిరాజు, బిజెపి నాయకులు బుంగా సారథి, పేరాల మోహన్ తదితరులు పాల్గొన్నారు.