పశ్చిమగోదావరి

చెట్లను పెంచి వాతావరణ కాలుష్యాన్ని నివారించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెంటపాడు, మార్చి 27: రోడ్లపక్కన గృహాల వద్ద విరివిగా చెట్లు పెంచి వాతావరణ కాలుష్యాన్ని నివారణకు కృషిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా మండలంలోని వల్లూరుపల్లి, పరిమెళ్ల, యానాలపల్లి, ఉమామహేశ్వరం, బిళ్లగుంట గ్రామాలను ఆయన పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌తోపాటు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాతావరణ కాలుష్య నివారణకు చెట్లు పెంపకం ప్రధానమని ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ఇటీవల పూడికతీసిన చెరువులకు మంచినీరు, పశువుల, రజకుల చెరువులను పూర్తిగా నీటితో నింపాలని, కాలువ తగ్గిన తరువాత ఆయిల్ ఇంజిన్ల సహాయం కోరవద్దని ఆయన తెలిపారు. గ్రామాల్లో స్వచ్ఛ్భారత్ పాటించాలని ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కిలపర్తి వెంకట్రావు, తాడేపల్లిగూడెం ఏ ఎంసీ ఛైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, తెలుగుదేశం నాయకులు పాలూరి భాస్కరరావులు పాల్గొన్నారు.