పశ్చిమగోదావరి

ఇక నెలకోసారి పోలవరానికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 13: ఎన్నో దశాబ్దాలు కలగా ఉండిపోయిన పోలవరం ప్రాజెక్టుకు నిధుల కళ వచ్చే అవకాశాలు చాలావరకు మెరుగుపడ్డాయి... కేంద్రం నుంచి పూర్తిస్ధాయి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లే సంకేతాలు స్పష్టమయ్యాయి... ఈనేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పనులను ఇకనుంచి పరుగులు తీయించాలని నిర్ణయించారు....దానిలో భాగంగానే ఆధునిక యంత్రాలను రంగంలోకి దింపారు... ఈనేపధ్యమే మంగళవారంనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా అన్ని సందర్భాల్లోనూ ఉల్లాసభరితమైన వాతావరణానికి కారణమైందని చెప్పచ్చు... పర్యటన యావత్తు చంద్రబాబు ఉల్లాసంగాను, ఉత్సాహంగాను కన్పించటమే కాకుండా ఆధునిక యంత్రాలతో ఫోటోలు తీయించుకునేందుకు ఉత్సాహపడిన వారిని ఎక్కడా నిరాశపర్చకుండా ఫోటోలు దిగారు. మొత్తంమీద ఎప్పటికలగానో ఉండిపోయి, అలాగే నిలిచిపోతుందా అన్న ఆందోళన జిల్లావాసుల్లో స్పష్టంగా కన్పిస్తున్న సమయంలో కేంద్రం నుంచి వచ్చిన నిధుల గ్రీన్‌సిగ్నల్‌తో చంద్రబాబు కూడా మంచి ఉత్సాహంగాను, మరింత పట్టుదలతోనూ కన్పించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించటమే కాకుండా ఆస్ట్రేలియా నుంచి కోట్ల రూపాయల వ్యయంతో దిగుమతి చేసుకున్న భారీ యంత్రసామాగ్రిని ప్రారంభించి ఆతర్వాత అధికారులు, కాంట్రాక్టు ఏజన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అయితే సాయంత్రం వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్‌లో కాకుండా రోడ్డుమార్గాన విజయవాడ చేరుకున్నారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో విలేఖరులతో మాట్లాడిన చంద్రబాబు ఇకనుంచి పోలవరం పనులు పరుగులు తీస్తాయని స్పష్టం చేశారు. 2018నాటికి ఈపనులను పూర్తిచేస్తామని ప్రకటించారు. తాజాగా తీసుకువచ్చిన అధునాతన వాహనాల ద్వారా నిత్యం వేలక్యూబిక్ మీటర్ల మట్టిపనులు ముందుకెళ్తాయని, అలాగే అదే సమయంలో కాంక్రీట్ పనులు కూడా చేపడతామని చెప్పారు. రోజువారీ ఇక్కడ ఎంతపని జరగాలి, ఎంత పని జరిగింది అన్న వివరాలను తన కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పరిశీలిస్తానని, ప్రతి సోమవారం వర్చ్యువల్ పరిశీలన చేపడతానని, అలాగే ప్రతినెల మూడవ సోమవారం పోలవరానికి నేరుగా వచ్చి పనుల సమీక్ష చేపడతానని చెప్పారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనిరీతిలో 50లక్షల క్యూసెక్కుల నీటి డిశ్చార్జ్‌కి సరిపడే స్ధాయిలో ఇక్కడ పనులను ముందుకు తీసుకువెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో ఈపనులు అత్యధికభాగం పూర్తి చేసేలా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. వర్షాకాలం మినహాయించి మిగిలిన రోజులన్నీ నిత్యం పనులు యుద్దప్రాతిపదికన జరిగేలా అందరితో సమన్వయం సాధించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంకా ఈప్రాంతంలో 639లక్షల క్యూబిక్‌మీటర్ల మట్టిపనులు జరగాల్సి ఉందని, వీటిని వేగవంతం చేయాలని ఆదేశించామన్నారు. ఇంతవరకు 13సార్లు పోలవరం పనులను పరిశీలించానని, తొమ్మిదిసార్లు వచ్చి పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని పూర్తి చేయించానని చెప్పారు. దశాబ్దాల కలగా మిగిలిపోయిన పోలవరాన్ని బిజెపి ప్రభుత్వ సహకారంతో త్వరలో వాస్తవరూపం ధరించేలా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నీటిభద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, రాష్టవ్య్రాప్తంగా ఎక్కడికక్కడ ఒక్క సెంటిమీటర్ వర్షపునీటిని భూగర్భజలంగా మార్చగలిగితే మన విస్తీర్ణంతో పోలిస్తే 59టిఎంసిల భూగర్భజలాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
కాగా రాష్ట్రంలో అభివృద్ది పనులను, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తుంటే విపక్షాలు అడుగడుగునా అడ్డుపడుతున్నాయని ధ్వజమెత్తారు. వీళ్ల పరిస్దితి చూస్తుంటే హిట్ అండ్ రన్ బ్యాచ్‌గా తయారయ్యారని విమర్శించారు. ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ నష్టం చేసి పరారీ అవుతున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెపితే దానిని కూడా రకరకాల అవాంతరాలు సృష్టించారని, రాజధాని విషయంలోనూ న్యాయస్ధానాలను ఆశ్రయించి పనులు ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైకాపా తరపున అభ్యర్దిగా పోటీచేసిన వ్యక్తి రాజధాని పనుల విషయంలో కనీసం టెండరు కూడా వేయకుండా కోర్టును ఆశ్రయించి స్టే తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈవిధంగా అన్నిచోట్లా అడ్డం పడుతున్నారని చెప్పారు. అయినప్పటికీ తాను రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తలపెట్టిన పనులు పూర్తి అయితే వాళ్లకి పుట్టగతులు ఉండదన్న ఆందోళన వారిని వేధిస్తోందని, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. వైకాపా వ్యవహారం చూస్తుంటే ఎక్కడ అభివృద్ధి తలపెట్టినా దాన్ని ఆపేస్తే వీరికి సంతోషం కలిగేలా కన్పిస్తోందని విమర్శించారు. ఈ ఉన్మాదానికి కారణం ఏముంటుందని చెప్పాలని ప్రశ్నించారు. కాగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తాను అన్నివిధాలా కృషి చేస్తున్నానని, గత అయిదేళ్లుగా 13వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేసుకోకుండా వదిలివేశారని, అలాంటి నిధులు కూడా వెతికిపట్టుకుని నాలుగువేల కోట్ల రూపాయలు విడుదల చేయించానని, దానివల్లే అన్ని గ్రామాల్లోనూ అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ పధకాల కాక మిగిలిన అన్ని నిర్మాణాలను కేంద్రమే చేపడుతుందన్నారు.
ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ ప్రకటించిందని, దీనికి ప్రధాని నరేంద్రమోదికి మంగళవారం ఉదయం ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పానని చంద్రబాబు తెలిపారు. ఈవిషయంలోనూ రకరకాల అభిప్రాయాలను తెరపైకి తీసుకువస్తున్నారని, అయితే కొంతమంది ఏపనులు చేయకుండా సెంటిమెంట్‌తో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈవిషయంలో ప్రజలు అంతకుమించి యువత ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లగలమన్న విషయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించి అనంతర చర్యలను పూర్తి చేయాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, శాసనమండలి విప్ అంగర రామ్మోహన్, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, గన్ని వీరాంజనేయులు, కెఎస్ జవహర్, మొడియం శ్రీనివాసరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, పులవర్తి రామాంజనేయులు, బూరుగుపల్లి శేషారావు, వేటుకూరి శివరామరాజు, జడ్పీ వైస్‌ఛైర్మన్ సిహెచ్ వెంకటరమణ, ప్రిన్సిపల్ కార్యదర్శి సతీష్‌చంద్ర, జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఏలూరు రేంజ్ డిఐజి రామకృష్ణ, జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టరు అరుణకుమార్, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, భూసేకరణ ప్రత్యేక కలెక్టరు భానుప్రసాద్, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీరు హరిబాబు, జిల్లా జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.