పశ్చిమగోదావరి

పట్టిసీమ పైపులైన్లతో మునిగిపోతున్న పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, సెప్టెంబర్ 23: పట్టిసీమ ఎత్తిపోతలకు సంబంధించి పైపులైనుపై గట్టు వేయడం వల్ల తమ పొలాలు వర్షం నీటిలో ముంపునకు గురై పంటలు పాడై పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ రెవెన్యూ పరిధిలో సుమారు వెయ్యి ఎకరాలు వర్షం నీటి ముంపులో ఉన్నాయి. ఎత్తిపోతల పైపులైన్లపై ఎత్తుగా గట్టు వేయడంతో వర్షం నీరు బయటకు వెళ్లే దారి లేక పంటలు వర్షం నీటిలో ఉన్నాయని రైతులు బదిరెడ్డి వెంకన్నదొర, సానా శ్రీనివాస్, తెలగంశెట్టి సూర్యచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పొలాలపై వర్షం నీరు పోలవరంలోని కడెమ్మ స్లూరుూస్ ద్వారా గోదావరిలోకి వెళ్లేది. అయితే పైపులైన్ల ప్రాంతంలో గట్లు కారణంగా నీరు బయటకు వెళ్లే దారి లేక పంటలు దెబ్బతిన్నాయన్నారు. పైపు లైను నిర్మిస్తున్నప్పుడే పట్టిసీమ, బంగారమ్మపేట రైతులు ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. సుమారు పంట పొలాలపై రెండు అడుగుల మేర నీరు నిలిచివుందని రైతులు వాపోతున్నారు.