పశ్చిమగోదావరి

ప్యాకేజీ స్పష్టమయ్యాకే సర్వేచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, సెప్టెంబర్ 29: మండలంలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఎంతిస్తారో స్పష్టం చేసాకే సర్వే చేయాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. వేలేరుపాడులో వేలాది మందితో ప్రారంభమైన ర్యాలీ ఎంపిడిఒ కార్యాలయంలో నిర్వహించే సభ వరకూ కొనసాగింది. అనంతరం అక్కడ నినాదాలతో ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై సబ్ కలెక్టర్ షణ్మోహన్ అఖిలపక్షం నేతల నుండి డిమాండ్లు విని, వారికి వరుస క్రమంలో సమాధానాలిచ్చారు. వేలేరుపాడు ప్రజలకు న్యాయం చేయడం కోసమే ఇంత జాప్యం జరిగిందని, లేకుంటే ఏనాడో సర్వే పూర్తిచేసేవారమన్నారు. సర్వేను అడ్డుకోవడంలో అర్థం లేదని, ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతమైనందున సర్వేలు పూర్తిచేసి నూతన జీవో ప్రకారం పరిహారం ఇస్తామన్నారు. అయినప్పటికీ సర్వేలు అడ్డుకుంటే 2011 డేటా ప్రకారం పరిహారం అందించేందుకు వెనుకాడబోమన్నారు. ప్రస్తుతం వేలేరుపాడు మండలంలో ఏడు గ్రామ పంచాయతీలు, కుకునూరు మండలంలో నాలుగు గ్రామాల వివరాలు మాత్రమే సేకరించాల్సి ఉందని, నూతనంగా కేవలం 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు, వివాహమైన వారి కుటుంబాలు సేకరించాలన్నదే తప్ప పాత డేటా అయితే తమ వద్ద సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అపోహలతో ప్రజలను తప్పుదోవపట్టించవద్దన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసు, ఎంపిడిఒ రాజేంద్రప్రసాద్, అఖిలపక్షం నాయకులు ఉన్నారు.