పశ్చిమగోదావరి

పరిష్కారం పది శాతమేనా ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 30: జిల్లాలో ప్రజల నుంచి వచ్చే మీకోసం అర్జీల పరిష్కారం విషయంలో దాటవేసే ధోరణిలో కాకుండా న్యాయబద్ధంగా పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. మీకోసం అర్జీల్లో కేవలం పది శాతం మాత్రమే పరిష్కారమవుతున్నాయని, 90 శాతం అర్జీలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం తహశీల్దార్లు, ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. తహశీల్దార్ స్థాయిలో పరిష్కారమయ్యే అర్జీలు కూడా తనకు, జాయింట్ కలెక్టర్ వద్దకు రావడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు సరిగ్గా స్పందించకపోవడం వలనే అర్జీదారులు ఉన్నతాధికారుల వద్దకు వస్తున్నారన్నారు. డిసెంబర్ నెలాఖరులోగా తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ దీపం పధకం కింద గ్యాస్ కనెక్షన్లు అందజేయాలని ఆదేశించారు. కొన్ని ఏజెన్సీలు కనెక్షన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంలో తహశీల్దార్లు శ్రద్ధవహించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఫైళ్ల పరిష్కారం విషయంలో అధికారులు కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాల్సిన అవసరంవుందన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లో అక్టోబర్ 2 నాటికి బహిరంగ మలవిసర్జన లేని ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని, మూడవ తేదీ నుంచి ఎక్కడైనా బహిరంగ మలవిసర్జన చేస్తున్నట్లు గమనిస్తే సంబంధిత కమిషనర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఫామ్ పాండ్స్ అంశాన్ని సమీక్షిస్తూ వేలేరుపాడు, కుకునూరు, పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఈ వారం 34 ప్రారంభించాల్సి వుండగా ఒక్కటి కూడా ప్రారంభించకపోవడంపై ఐటిడిఎ పివో షణ్మోహన్‌ను ప్రశ్నించారు. కార్యక్రమంలో జడ్పీ సిఇవో డి సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ అమరేశ్వరరావు, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, డిఎస్‌వో శివశంకర్‌రెడ్డి, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాస్‌లు, డ్వామా పిడి వెంకటరమణ, ఎన్‌ఐసి శర్మ, మత్స్యశాఖ డిడి జాకబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.