పశ్చిమగోదావరి

మహాలక్ష్మీదేవిగా అమ్మవారి దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, అక్టోబర్ 7: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధనలక్ష్మిదేవిని రూ. 49 లక్షలతో ఆలయంలో అలంకరించారు. ధనలక్ష్మిదేవిగా కన్యకా పరమేశ్వరి దర్శనమిచ్చింది. వైష్ణవిదేవిగా ఉత్సవమూర్తిని అలంకరించారు. 900 మంది మహిళలు సుహాసిని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గమిని సుబ్బారావు, అధ్యక్ష, కార్యదర్శులు వబిలిశెట్టి నటరాజ్, కొండూరి సుబ్రహ్మణ్యం, చలంచర్ల మురళి తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండలం వీరంపాలెంలో బాలాత్రిపుర సుందరి పంచాయతన క్షేత్రంలో గరిమెళ్ల వెంకటరమణ సిద్దాంతి నేతృత్వంలో చండీహోమం నిర్వహించారు. బాలాత్రిపుర సుందరిదేవిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. 17వ వార్డు విశ్వదుర్గేశ్వర ఆలయంలో గొర్రెల శ్రీ్ధర్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో శాకాంబరిదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. కొవ్వూరి నాగేంద్రరెడ్డి, సత్యనారాయణరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్థనిగా దర్శనమిచ్చారు. ఈవో సి.హెచ్.వెంకట నాగమునేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం శ్రీ గంగానమ్మ తల్లి మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గర్భాలయాన్ని, అమ్మవారిని రూ.33 లక్షల కొత్త కరన్సీ వెయ్యి, రూ.500ల నోట్లతోను, కిలో బంగారు ఆభరణాలతోను అలంకరించారు. శుక్రవారం తొలి పూజల్లో పివి సత్యనారాయణ, దేవులపల్లి వెంకట సత్యనారాయణ, ప్రశాంతి గోల్డ్‌వర్క్స్ అధినేత, బవిరిశెట్టి తిలక్ దంపతులు పాల్గొన్నారు. శ్రీ లలిత సూర్య స్వీట్స్ అధినేత ఆకుల రామచంద్రరావు (రాము) 86 కిలోల డ్రై ఫ్రూట్స్ లడ్డు అమ్మవారికి సమర్పించారు. శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత రాంబాబు 56 కిలోల లడ్డు అమ్మవారికి సమర్పించారు. నరేంద్ర మిల్క్ సెంటర్, నున్న సుబ్బారావు జ్ఞాపకార్థం నున్న బేబీ సరోజిని భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం 5 గంటల వరకు సామూహిక ఉచిత కుంకుమార్చనలు జరిగాయి. అమ్మవారి ప్రత్యేకాలంకరణ కలువలపల్లి మోహనశర్మ చేసారు. మున్సిపల్ కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావు, డాక్టర్ డి భాస్కరరావు, చిట్రోజు తాతాజి, రెడ్డి రంగప్రసాద్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.